/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/15-1-jpg.webp)
Janhvi Kapoor With Radhika Merchant: బాలీవుడ్ నటి, శ్రీదేవి చిన్న కూతురు జాన్వీ కపూర్ మరోసారి నెట్టింట సందడి చేసింది. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జాన్వీ.. తాజాగా రిలయన్స్ అధినే ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ (Anant Ambani) అంబానీ కాబోయే భార్య రాధికకు (Radhika Merchant) స్పెషల్ పార్టీ ఇచ్చింది.
View this post on Instagram
ఇది కూడా చదవండి: NTR: ‘దేవర’లోకి బోల్డ్ బ్యూటీ.. తారక్ పై ఇంట్రెస్టింగ్ పోస్ట్!
ఈ పార్టీకి అంబానీ పెద్ద కోడలు శ్లోకా మెహతా, కుమార్తె ఇషా, జాన్వీ స్నేహితుడు శిఖర్ పహరియాతో పాటు పలువురు ప్రముఖులు హాజరవగా.. వివిధ రకాల గేమ్స్, విందుతో సరదాగా సాగింది. ఈ సరదాకు సంబంధించిన ఫొటోలను జాన్వీ తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. తమకెంతో ప్రత్యేకమైన కొత్త పెళ్లి కూతురు కోసం పార్టీ నిర్వహించడం సంతోషంగా ఉందంటూ మురిసిపోయింది. అందరూ ఒకే రకమైన గులాబీ రంగు దుస్తుల్లో మెరిపోగా నెటిజన్లు ఫిదా అయ్యామంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram