Janhvi Kapoor: మరో టాలీవుడ్ హీరోను బుట్టలో పడేస్తున్న జాన్వీ.. తెగ పొగిడేస్తుంది!

నాని, మృణాల్‌ ఠాకూర్‌ లపై జాన్వీ కపూర్ ప్రశంసలు కురిపించింది. ''హాయ్ నాన్న' సినిమాలో ఇద్దరి నటనకు ప్రేమలో పడిపోయా. తొలి ప్రయత్నంలోనే మనుసుని హత్తుకునే చిత్రాన్ని అందించినందుకు శౌర్యువ్‌కు కృతజ్ఞతలు. నాని ఎప్పటిలాగే అదరగొట్టేశారు' అంటూ పొగిడేసింది.

New Update
Janhvi Kapoor: మరో టాలీవుడ్ హీరోను బుట్టలో పడేస్తున్న జాన్వీ.. తెగ పొగిడేస్తుంది!

Janhvi Kapoor: బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీకపూర్‌ (Janhvi Kapoor) టాలీవుడ్ హీరో నానిపై (Nani) ప్రశంసలు కురిపించింది. శౌర్యువ్ దర్శకత్వంలో నాని, మృణాల్ ఠాకూర్ జంటగా వచ్చిన 'హాయ్ నాన్న' మూవీ ఇటీవల విడుదలై పాజిటీవ్ టాక్ అందుకుంది. అయితే తాజాగా ఈ మూవీ చూసినట్లు చెబుతూ సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసిన జాన్వీ.. మూవీ కంటెంట్, నటీనటుల పనితీరును పొగిడేసింది. ముఖ్యంగా నాని యాక్టింగ్ తో అదరగొట్టేశారంటూ ఆకాశానికెత్తేసింది.

''హాయ్ నాన్న' సినిమాలో నాని, మృణాల్‌ ఠాకూర్‌ నటనకు ప్రేమలో పడిపోయా. తొలి ప్రయత్నంలోనే మనుసుని హత్తుకునే చిత్రాన్ని అందించినందుకు శౌర్యువ్‌కు కృతజ్ఞతలు. నాని.. ఎప్పటిలాగే అదరగొట్టేశారు’ అంటూ హీరో హీరోయిన్లు క్లోజ్ గా కనిపించే పిక్  ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది.

publive-image

ఇక జాన్వీ ప్రశంసలపై స్పందించిన మూవీ నిర్మాణ సంస్థ వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఆనందం వ్యక్తం చేసింది. ‘మీ ప్రశంసలు మాకెంతో విలువైనవి’ అంటూ జాన్వీకి థాంక్స్ చెప్పారు.

ఇక బేబీ కియారా, నాజర్‌, జయరాం కీలకపాత్రలు పోషించిన సినిమా డిసెంబర్‌ 7న విడుదలైన మంచి విజయాన్ని అందుకుంది. తండ్రిగా నాని నటనకు సినీ ప్రముఖులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఇది నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది.

జాన్వీ సినిమాల విషయానికొస్తే కొరటాల శివ, తారక్ కాంబోలో వస్తున్న ‘దేవర’తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా ఫస్ట్ పార్ట్ 2024 సమ్మర్ స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

publive-image

#nani #janvi-kapoor #hi-nanna
Advertisment
తాజా కథనాలు