మీకెన్ని..? మాకెన్ని..?.. సీట్ల లెక్క తేల్చనున్న టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ..

ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో రాష్ర్టంలో రాజకీయ పార్టీలు స్పీడు పెంచాయి. ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఇప్పటినుంచే కసరత్తులు ప్రారంభించాయి. రానున్న ఎన్నికల్లో కలిసి పోటీచేస్తామని ప్రకటించిన టీడీపీ-జనసేన పార్టీలు పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నాయి. సీట్ల పంపకాలు, నాయకుల మధ్య సమన్వయం కోసం ఇరు పార్టీలు కమిటీలను ఏర్పాటు చేశాయి. టీడీపీతో సమన్వయం కోసం నాదెండ్ల మనోహర్‌ ఆధ్వర్యంలో గతంలోనే జనసేన పార్టీ కమిటీని ఏర్పాటు చేసింది.

New Update
AP: టీడీపీ - జనసేనలో మొదలైన ముసలం.. పెత్తనం కోసం ముదురుతున్న వైరం..!

Andhra Pradesh: ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో రాష్ర్టంలో రాజకీయ పార్టీలు స్పీడు పెంచాయి. ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఇప్పటినుంచే కసరత్తులు ప్రారంభించాయి. రానున్న ఎన్నికల్లో కలిసి పోటీచేస్తామని ప్రకటించిన టీడీపీ-జనసేన పార్టీలు పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నాయి. సీట్ల పంపకాలు, నాయకుల మధ్య సమన్వయం కోసం ఇరు పార్టీలు కమిటీలను ఏర్పాటు చేశాయి. టీడీపీతో సమన్వయం కోసం నాదెండ్ల మనోహర్‌ ఆధ్వర్యంలో గతంలోనే జనసేన పార్టీ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం జనసేనతో సమన్వయం కోసం టీడీపీ ఆదివారం నాడు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ప్రకటించింది. ఈ కమిటీలో రాష్ర్ట పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్‌ నేతలు యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్‌, పితాని సత్యనారాయణ, తంగిరాల సౌమ్య ఉన్నారు. ఈ రెండు కమిటీల పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వంపై పోరాటాలు వంటి విషయాల్లో కలిసి వెళ్లేలా కేడర్‌ను సమన్వయం చేసుకోనున్నాయి.

సీట్ల పంపకాలపైనే ప్రధాన చర్చ..

అయితే ఈ రెండు పార్టీల సమన్వయ కమిటీలు ప్రధానంగా సీట్ల పంపకాలపైనే చర్చించనున్నట్లు సమాచారం. ఆయా జిల్లాల పరిధిలో ఏయే స్థానాల్లో ఎవరి బలం ఎంత? ఎవరు పోటీచేస్తే బాగుంటుంది అన్న దానిపై సర్వేలు చేసి చర్చలు జరపనున్నట్లు తెలిసింది. టీడీపీ, జనసేన పొత్తుతో సీట్ల పంపకాలపై ఇప్పటికే రెండు పార్టీల్లోనూ ఉత్కంఠ కొనసాగుతోంది. పొత్తులో భాగంగా తమ సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందోనని టీడీపీలో ఎంతో కాలంగా పనిచేస్తున్న సీనియర్లను టెన్షన్‌ వెంటాడుతోంది. ప్రధానంగా గోదావరి జిల్లాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో పవన్‌ వారాహి యాత్ర పూర్తయింది. ఇప్పటికే పోటీ చేయాలనుకుంటున్న పలు నియోజకవర్గాలపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సర్వేలు చేయించినట్లు సమాచారం. ఆ జాబితా ఆధారంగానే టీడీపీతో చర్చలు చేయనున్నారు.

30కి పైగా స్థానాల్లో పోటీకి జనసేన సై

ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్‌ కోరుతున్న స్థానాల్లో మెజారిటీ సంఖ్య జనసేనకు కేటాయించేందుకు ఇప్పటికే టీడీపీ అంగీకరించినట్లు సమాచారం. అయితే కొన్ని స్థానాలను వదులుకునేందుకు ఆ పార్టీ ద్వితీయ స్థాయి నాయకత్వం సిద్ధంగా లేనట్లు సమాచారం. వీటిపై కచ్చితంగా ఆయా నియోజకవర్గాల్లో వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. కావున అలాంటి స్థానాలపై సుదీర్ఘంగా చర్చించి స్థానిక నాయకులను ఒప్పించే విధంగా కమిటీలు పనిచేయనున్నట్లు తెలిసింది. తూర్పుగోదావరిలో పిఠాపురం, కాకినాడ రూరల్, పి.గన్నవరం, రాజోలుతో పాటుగా అమలాపురం నుంచి జనసేన బరిలో నిలవనున్నట్లు సమాచారం. పశ్చిమ గోదావరిలో భీమవరం, నర్సాపురం, తాడేపల్లి గూడెం, నిడదవోలు జనసేకు ఖాయమైనట్లు సమాచారం. అదే విధంగా.. అవనిగడ్డ పెడన, కైకలూరు జనసేకు ఇచ్చేందుకు ఇప్పటికే అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. విజయవాడ వెస్ట్ నుంచి వంగవీటి రాధా పోటీ ఖాయమని సమాచారం. వీటన్నిటిని కలిపి రాష్ట్రవ్యాప్తంగా 25-30 స్థానాలు జనసేనకు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధమైనట్లు లీకులు వస్తున్నాయి. అయితే తమకు రాష్ట్రవ్యాప్తంగా 30-40 స్థానాలు కావాలని జనసేన పట్టుపట్టనుంది. ఈ నేపథ్యంలో ఇరు కమిటీలు దీనిపై ఒక స్పష్టమైన అవగాహనకు రానున్నాయి. అనంతరం సీట్ల పంపకాలపై తుది నిర్ణయం తీసుకోనున్నాయి.

publive-image

Also Read:

CM KCR Live: మళ్లీ అధికారం మనదే.. ఆ విషయంలో అలర్ట్ గా ఉండండి: అభ్యర్థులతో కేసీఆర్

చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వ తీరు అమానవీయం..పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన

Advertisment
తాజా కథనాలు