బీజేపీకి మద్దతివ్వడానికి కారణం అదే: క్లారిటీ ఇచ్చిన పవన్ కల్యాణ్

బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్న హామీ కారణంగానే జనసేన బీజేపీకి మద్దతిస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు. తెలంగాణతో తనకు భావోద్వేగపరమైన అనుబంధం ఉందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణ సమగ్రాభివృద్ధి జరుగుతుందన్నారు.

బీజేపీకి మద్దతివ్వడానికి కారణం అదే: క్లారిటీ ఇచ్చిన పవన్ కల్యాణ్
New Update

Pawan Kalyan: బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ నిర్ణయం హర్షణీయమని, అందుకే తాను ఆ పార్టీకి మద్దతు పలుకుతున్నానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. బీసీలకు రాజ్యాధికారం ఇస్తున్న బీజేపీకి అందరూ మద్దతివ్వాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వికారాబాద్ జిల్లా తాండూలో బీజేపీ - జనసేన ఉమ్మడి అభ్యర్థి శంకర్‌గౌడ్ తరఫున శనివారం పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సారి తమ అభ్యర్థిని ఆశీర్వదించి బీసీ చేతికి అధికారం అందించాలని ప్రజలను కోరారు.

ఇది కూడా చదవండి: అశోక్ నగర్‎లో రాహుల్ గాంధీ.. నిరుద్యోగులతో చిట్‎చాట్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం బలహీన వర్గాలకు రాజ్యాధికారం, వారి చేతికి నాయకత్వం రావాలని తాను ఎంతగానో ఆకాంక్షించానని పవన్ కల్యాణ్ చెప్పారు. తెలంగాణ పోరాటం, చరిత్ర తనకు స్ఫూర్తిదాయకమన్నారు. తెలంగాణతో తనకు భావోద్వేగపరమైన అనుబంధం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి తాను రుణపడి ఉంటానన్నారు. రాష్ట్రంలో బీసీకు రాజ్యాధికారం దక్కాలని పవన్ ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణ సమగ్రాభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు ఏ అన్యాయం జరిగినా తాను తప్పకుండా తిరగబడతానని స్పష్టంచేశారు.

#telangana-elections-2023 #bjp-telangana #pawan-kalyan #janasena
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe