కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమిలో భాగమైన ప్రతి పార్టీకి కేంద్రంలో సహాయ మంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో జనసేనకు సైతం కేంద్రంలో సహాయ మంత్రి పదవి దక్కనుంది. జనసేన పోటీ చేసిన రెండు ఎంపీ స్థానాల్లో గెలిచిన సంగతి తెలిసిందే. మచిలీపట్నం నుంచి బాలశౌరి.. కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్ ఎంపీగా గెలుపొందారు. అయితే ఈ ఇద్దరిలో ఒకరికి కేంద్రంలో సహాయ మంత్రిగా పదవి వచ్చే అవకాశం ఉంది. బాలశౌరికి ఈ పదవి వచ్చే ఛాన్స్ ఉందని చర్చ నడుస్తోంది.
Also Read: ఇక నుంచి కొత్త చంద్రబాబును చూస్తారు…అంటూ బాబు కీలక వ్యాఖ్యలు!