Janasena: చేగొండి సూర్య ప్రకాష్‌పై వ్యతిరేకత..!

చేగొండి సూర్య ప్రకాష్ వైసీపీకి ఎంత ప్యాకేజ్ కు అమ్ముడుపోయాడో అంటూ విమర్శలు గుప్పించారు జనసైనికులు. పశ్చిమ గోదావరి పెనుగొండలో నాలుగు మండలాల జనసేన అధ్యక్షులు, కార్యకర్తలు సమావేశమై ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Janasena: చేగొండి సూర్య ప్రకాష్‌పై వ్యతిరేకత..!
New Update

Janasena Leaders:  కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య (Chegondi Harirama Jogaiah) కుమారుడు సూర్య ప్రకాష్‌ జనసేనకు రాజీనామా చేసి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో జనసైనికులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. పశ్చిమ గోదావరి ఆచంట నియోజకవర్గం పెనుగొండలో నాలుగు మండలాల జనసేన అధ్యక్షులు, కార్యకర్తలు సమావేశమైయ్యిరు.

Also Read: అటు టీడీపీ.. ఇటు వైసీపీ.. టార్గెట్ పవన్ కళ్యాణ్!! ఎందుకో మరి..

ఈ సందర్భంగా చేగొండి సూర్య ప్రకాష్ కు వ్యతిరేకంగానే పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎదుగుదలకు ఎప్పుడు కృషి చేయలేదంటూ మండిపడ్డారు. సూర్య ప్రకాష్ వైసీపీకి ఎంత ప్యాకేజ్ కు అమ్ముడుపోయాడో అంటున్నారు జనసేన నాయకులు. ఆచంట నియోజకవర్గంలో పార్టీ నాశనం అవటానికి సూర్య ప్రకాష్ కారణం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూర్య ప్రకాష్ పార్టీని వీడినా.. ఇక నుంచి నియోజకవర్గంలో జనసేనను మరింతా బలోపేతం చేస్తామంటూ తీర్మానం చేసుకున్నారు.

Also Read: మంత్రి రోజాకు సొంత పార్టీలోనే అసమ్మతి.. జడ్పీటీసీ మురళీధర్, మంత్రి రోజా మధ్య ముదిరిన రగడ

కాగా, 2018లో జనసేనలో చేరారు సూర్యప్రకాష్. అయితే, పవన్‌ కళ్యాణ్ (Pawan Kalyan) వైఖరికి నిరసనగా సూర్య ప్రకాష్‌ పార్టీ మారారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీట్ విషయంలో పవన్ క్లారిటీ ఇవ్వకపోవడంతో  జనసేన పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధికార గూటికి చేరుకున్నారు. వైసీపీలో చేరిన అనంతరం జనసేనపై విమర్శలు గుప్పించారు. దీంతో, జనసైనికులు సూర్య ప్రకాష్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. 

#andhra-pradesh #janasena-leaders
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe