వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలి
పూర్తిగా చదవండి..చిన్నారిని చంపేసిన చిరుత పులి ఘటనలో కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతోంది. ప్రాణాలు కోల్పోయిన లక్షిత కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పాలని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంలో శశికళ, దినేష్ దంపతుల బిడ్డ లక్షత తిరుమలలో చిరుత పులి బారినపడి ప్రాణాలు కోల్పోవడం బాధకరమన్నారు. బిడ్డని కోల్పోయి శోకసముద్రంలో వారు ఉంటే మీకు కనీసం మానవత్వం ఉందా..? అని కిషోర్ ప్రశ్నించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానన్నారు. టీటీడీ తరఫున నష్టపరిహారం కాకుండా నియోజకవర్గం తరఫున నేను కూడా చింతిస్తున్నానని చెప్పాల్సింది పోయి.. వారి తల్లిదండ్రులను విచారించాలని చెప్పడం సరైన పద్ధతి కాదన్నారు. మీకు సామాన్యుల ప్రాణాలంటే లెక్కలేదాని మండిపడ్డారు. కోవూరు నియోజకవర్గంలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి.. గ్రావెల్, ఇసుక, ప్రభుత్వ స్థలాలు ఏమవుతున్నాయని ప్రశ్నించారు. అన్ని వదిలేసి సామాన్య మానవుడి ప్రాణాలపై మీ అనుమానాలు వ్యక్తపరచడం సబబు కాదని ఫైర్ అయ్యారు. నిన్న ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ ‘తల్లిదండ్రుల మీద అనుమానాలు ఉన్నాయన్నారు’. వారిని గట్టిగా విచారించాలన్నారు.
చిన్నారిని చంపిన చిరుతపులి
తిరుమలలో అలిపిరి నడక మార్గంలో ఆరేళ్ల పాప లక్షితను చిరుతపులి చంపేసినట్లు తెలిసింది. మొన్న రాత్రి శ్రీవారి దర్శనానికి వచ్చిన, నెల్లూరు జిల్లా ఫ్యామిలీకి చెందిన బాలిక అలిపిరి నడక మార్గంలో మిస్సైంది. పాప కోసం రాత్రంతా వెతికారు. పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చారు. కానీ తెల్లారి విషాద వార్త విన్నారు. తెల్లారి నడక మార్గంలో వెళ్తున్న భక్తులకు నరసింహస్వామి ఆలయం దగ్గర పాప మృతదేహం కనిపించింది. పాప తల, శరీరంపై తీవ్ర గాయాలున్నాయి. దాంతో.. చిరుతపులి ఆ పాపను చంపేసి ఉంటుందని అంచనా వేస్తున్నారు పోలీసులు. పాప మృతదేహాన్ని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. గత నెలలో 5 ఏళ్ల ఓ పిల్లాణ్ని ఇలాగే చిరుతపులి ఎత్తుకెళ్లింది. 500 మీటర్ల దూరంలో వదిలేసింది. అయితే.. స్వల్ప గాయాలతో ఆ పిల్లాడు సురక్షితంగా బయటపడ్డాడు. ఇప్పుడు మాత్రం బాలిక చనిపోవడం తల్లిదండ్రులతోపాటూ.. భక్తులలోనూ విషాదాన్ని నింపింది.
చర్యలు తీసుకోండి ఫ్లీజ్
ఇక తిరుమల శేషాచలం అడవుల్లో పులులు, చిరుతపులులు ఈ మధ్య ఎక్కువగా వస్తాయి. ఇవి భక్తులు తిరిగే ప్రాంతాల్లోకి అంతగారావు.. కానీ ఈమధ్య తరచూ చిరుతపులులు భక్తులు వెళ్లే ఘాట్ రోడ్లలో, కాలినడక మార్గాల్లోకి వస్తున్నాయి. వీటిని కంట్రోల్ చేసే విషయంలో అధికారుల్లో కొంత నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే వాదన వినిపిస్తోంది. తాజా ఘటనలో పాప తప్పిపోయిన విషయంపై పోలీసులు గట్టిగానే గాలించినా ప్రయత్నం లేకుండా పోయింది.అయితే తల్లిదండ్రుల నుంచి పాప ఎలా తప్పిపోయింది? ఎలా చిరుతకు చిక్కింది? అనేది తెలియలేదు. మొత్తానికి ఈ ఘటనతో నడక మార్గాల్లో చిరుతపులుల దాడితో భక్తుల్లో ఆందోళన ఎక్కవైంది. అటవీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అలిరిపి మార్గంలో గుంపులుగా మాత్రమే వెళ్లాలని.. రాత్రివేళ ఆ మార్గంలో వెళ్లొద్దని సూచించిన.. ఈ ఘటనపై టీటీడీ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.
[vuukle]