Amarnath : మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ (Gudivada Amarnath) చిక్కుల్లో పడ్డారు. అమర్‌నాథ్ భూదందాలు చేశారంటూ VMRDAకు జనసేన (Janasena) ఫిర్యాదు చేసింది. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం విస్సన్నపేటలో అమర్‌నాథ్ భూదందాలు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమర్‌నాథ్ అక్రమ లే-అవుట్‌లు వేశారని జనసేన లీడర్ మూర్తి యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్వే నెంబర్ 195/2లో గల 609 ఎకరాల ప్రభుత్వ భూమిలో నిబంధనలు విరుద్ధంగా లేఔట్లు వేసి విక్రయించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
గుడివాడ అమర్‌నాథ్ బినామీలు వైశాఖి వ్యాలి పేరుతో కొత్త బ్రోచర్లు విడుదల చేసి అమ్మకాలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. సీలింగ్, అసైన్డ్, కొండలు, ఇనాం భూములు కలిపేసుకున్నారన్నారు జనసేన నేత మూర్తి యాదవ్. ఈ వెంచర్స్‌కు రెరా అనుమతులు లేవని, వాల్టా చట్టాన్ని ఉల్లంఘించారని మూర్తి యాదవ్ ఉద్ఘాటించారు. VMRDA వైశాఖి వ్యాలీ అక్రమ లే-అవుట్‌లపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read : బెంగళూరులో దారుణం.. తన ప్రియురాలు దూరమవడానికి స్నేహితురాలే కారణమని.. ప్రియుడు అతి దారుణంగా..