Crime News : బెంగళూరులో దారుణం.. ప్రియురాలు దూరమవడానికి స్నేహితురాలే కారణమని.. ప్రియుడు అతి క్రూరంగా..

బెంగళూరు కోరమంగళలో దారుణం చోటుచేసుకుంది. హాస్టల్లోకి చోరబడిన యువకుడు యువతి కృతికుమారిని దారుణంగా కత్తితో గొంతు కోసి పరారైయ్యాడు. తన ప్రియురాలు దూరమవడానికి స్నేహితురాలు కృతికుమారే కారణమని నిందితుడు అభిషేక్‌ రగిలిపోయి ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది.

New Update
Crime News : బెంగళూరులో దారుణం.. ప్రియురాలు దూరమవడానికి స్నేహితురాలే కారణమని.. ప్రియుడు అతి క్రూరంగా..

Bangalore Girls Hostel Incident : బెంగళూరు కోరమంగళలో దారుణం చోటుచేసుకుంది. పీజీ హాస్టల్ (PG Hostel) లో ఉంటున్న ఓ యువతిని యువకుడు అతి దారుణంగా హతమార్చాడు. కత్తితో యువతి గొంతు కోసి పరారైయ్యాడు. కాపాడాలంటూ బాధిత యువతి ఎంత మొరపెట్టుకున్నా రూమ్‌మేట్స్‌ ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో తీవ్ర రక్తస్తావంతో స్పాట్‌లోనే యువతి మృతి చెందింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

మృతురాలు బీహార్‌ (Bihar) కు చెందిన యువతిగా అధికారులు గుర్తించారు. ఈ నెల 23న రాత్రి 11.10 నుంచి 11.30గంటల సమయంలో జరిగిన ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. హాస్టల్లోకి కత్తితో ప్రవేశించిన నిందితుడు.. మూడో అంతస్తులోని రూమ్‌ డోర్‌ కొట్టి లోపలికి ప్రవేశించి యువతిపై దాడి చేశాడు. యువతి గొంతు కోసి పరార్‌ అయ్యాడు. నిందితుడు భోపాల్‌ (Bhopal) కు చెందిన అభిషేక్‌గా అధికారులు గుర్తించారు.

అభిషేక్‌ ప్రియురాలికి మృతురాలు కృతికుమారి ఫ్రెండ్‌. అభిషేక్‌ ఉద్యోగం చేయడం లేదనే విషయంలో ప్రియురాలితో గొడవలు జరుగుతుండేవి. ఈ కారణంగా ప్రియురాలు అతనికి దూరంగా ఉంటూ వస్తోంది. అయితే, తన ప్రియురాలు దూరమవడానికి కృతికుమారే కారణమని అభిషేక్‌ రగిలిపోయాడు. అర్థరాత్రి హాస్టల్లోకి ప్రవేశించి కృతికుమారి గొంతు కోసి పరార్ అయ్యాడు. నిందితుడు అభిషేక్‌ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read : భార్యతో కలిసి బెంగళూరుకు జగన్


Advertisment
తాజా కథనాలు