Varahi yatra: పవన్‌ మూడో దశ వారాహి యాత్రపై సర్వత్రా ఉత్కంఠ.. ఆంక్షలతో టెన్షన్!

పవన్‌ కల్యాణ్ మూడో దశ వారాహి యాత్ర ఇవాళ(ఆగస్టు 10) విశాఖ నుంచి ప్రారంభమవనుండగా.. సాయంత్రం 5గంటలకు జగదంబా సెంటర్‌లో జనసేన నిర్వహించనున్న సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు సభకు పోలీసులు అనుమతి ఇచ్చినా కొన్ని కండీషన్స్‌ పెట్టారు. ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదని, పవన్ ని ఎయిర్‌పోర్ట్ నుంచి ర్యాలీగా రావొద్దని పోలీసులు సూచించారు. ఇక గత దశ వారాహి యాత్రలో వాలంటీర్లను టార్గెట్ చేసిన పవన్‌.. ఈసారి ఏ స్ట్రాటజీతో రానున్నారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Varahi yatra: పవన్‌ మూడో దశ వారాహి యాత్రపై సర్వత్రా ఉత్కంఠ.. ఆంక్షలతో టెన్షన్!
New Update

Pawan kalyan Varahi yatra starts: పవన్‌(pawan) మూడో గేర్‌ వేయనున్నారు. ఇవాళ (ఆగస్టు 10) విశాఖలో జనసేన అధినేత(Janasena chief) మూడో దశ వారాహి యాత్రకి శ్రీకారం చుట్టనున్నారు. రెండో దశ వారాహి యాత్ర(varahi yatra)లో వాలంటీర్ల టార్గెట్‌గా విమర్శలు గుప్పించిన పవన్‌.. ఈసారి ఏ స్ట్రాటజీతో రానున్నరన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సారి పవన్‌ స్పీచ్‌లపై అందరిచూపు నెలకొంది. అటు రాజకీయపరంగానే కాకుండా.. ఇటు ఉద్యోగులను సైతం తన ప్రసంగాల్లో ప్రస్తావిస్తుండడం ద్వారా పవన్‌కి అన్ని వర్గాల నుంచి అటెన్షన్‌ వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

జోష్ లో జనసేన:

ఇవాళ ప్రారంభంకానున్న వారాహి మూడో దశ యాత్ర.. ఈ నెల 19వరకు కొనసాగనుంది. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఇక ఈ యాత్రకు మధ్యలో ఒక రోజు బ్రేక్ రానుంది. పవన్‌ తన పార్టీ మంగళగిరి కార్యాలయాన్నిఈ నెల 15న విజిట్ చేయనున్నారు. ఆ రోజు స్వాతంత్ర దినోత్సవం. ఈ పది రోజుల్లో ఈ ఒక్క రోజు మాత్రం యాత్ర ఉండదు. ఇవాళ జగదాంబ జంక్షన్‌లో సభ నిర్వహించనుంది జనసేన. దీనికి సంబంధించి జనసేన శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. జగదాంబ సభ మీటింగ్ తర్వాత జానవాణి కార్యక్రమం, క్షేత్రస్తాయి పర్యటన కూడా ఉంటుందని సమాచారం. గంగవరం పోర్టు, తదితర ప్రాంతాలలో పవన్ కల్యాణ్ పర్యటిస్తారని తెలుస్తోంది. గత రెండు విడతల యాత్రను మించి మూడో విడత యాత్రను సక్సెస్ చేయాలని జనసేన భావిస్తోంది. యాత్రను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ యాత్రలో పవన్ కల్యాణ్ విశాఖలో జరుగుతున్న భూకబ్జాలకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలనలు చేపడతారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. పర్యావరణానికి నష్టం కలిగించేలా ధ్వంసం చేసిన ప్రాంతాలను కూడా పవన్ కల్యాణ్ సందర్శించనున్నారని జనసేన వర్గాలు తెలిపాయి.

ఆంక్షల మధ్యే యాత్ర:

రుషికొండ, ముదపాక, విస్సన్నపేట ప్రాంతాలను సందర్శించనున్న పవన్.. స్టీల్ ప్లాంట్, గంగవరం, కార్మికుల పోరాటానికి మద్దతుగా నిలవనున్నారు. మరోవైపు జనసేన యాత్ర సందర్భంగా పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. అనకాపల్లి జిల్లాలోని అనకాపల్లి, పరవాడ, నర్సీపట్నం సబ్‌ డివిజన్లలో ఆగస్టు 5 నుంచే సెక్షన్‌ 30 అమల్లో ఉంది. సెక్షన్‌ 30తో యాత్రను కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారని జనసేన నేతలు మండిపడుతున్నారు. ఇక ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదని, ఎయిర్‌పోర్ట్ నుంచి ర్యాలీగా రావొద్దని పోలీసులు సూచించారు. వాహనం పైనుంచి అభిమానులకు అభివాదాలు చేయవద్దని కండీషన్‌ పెట్టారు. పోలీసుల ఆంక్షలను ఉల్లంఘిస్తే బహిరంగసభకు అనుమతి తీసుకున్న వారిదే బాధ్యత అని స్పష్టం చేశారు.

#pawan-kalyan #varahi-yatra #janasena-chief-pawan-kalyan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe