Gaddar Jayanthi Celebrations: గద్దరన్న జీవితమే ఓ పోరాటం-జనసేన గద్దర్ జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ మేరకు రవీంద్రభారతిలో వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.ఈ వేడుకలో కళాకారులు, RTV యాజమాన్యం నివాళులు అర్పించారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం గద్దర్ కు నివాళులు అర్పిస్తూ ప్రకటన విడుదల చేసారు. By Nedunuri Srinivas 31 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Gaddar Jayanti Celebrations: ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక దివంగత గద్దర్ జయంతి (జనవరి 31) సందర్భంగా RTV నివాళులు అర్పిస్తోంది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నివాళి అర్పిస్తూ .. జనారణ్యంలో యుద్ధమొనరించిన సైనికుడు శ్రీ గద్దర్ అంటూ జనసేన విడుదల చేసిన ప్రకటనలో పవన్ గద్దర్ సేవలను కొనియాడారు. పోరాటమే జీవితం.. జీవితమే పోరాటంగా జీవన యానం సాగించిన విప్లవకారుడు శ్రీ గద్దర్ అంటూ బడుగు వర్గాల అభ్యున్నతికై తుది శ్వాశ వరకు ఆయన చేసిన సేవలను గుర్తు తెచ్చుకున్నారు. గద్దరన్న జీవితమే ఓ పోరాటం 'ఆతడు అనేక ప్రజా యుద్దముల ఆరితేరిన యోధుడు...' అనే మాటలు ప్రజా నౌక దివంగత గద్దర్ గారికి అన్వయించడం అతిశయోక్తి కాబోదు. పోరాటమే జీవితం.. జీవితమే పోరాటంగా జీవన యానం సాగించిన విప్లవకారుడు శ్రీ గద్దర్. మంది మాటలను పాటలుగా కూర్చి, ఆ పాటలనే తూటాలుగా పేర్చి జనం కోసం జనారణ్యంలో యుద్ధమొనరించిన సైనికుడు శ్రీ గద్దర్. ఎప్పుడు కలిసినా తమ్ముడా అంటూ పలకరించే ఆయన పలకరింపు నా గుండెకు చేరువుగా గోచరిస్తుంది. నీ నాయకత్వం యువతకు నేడు అవసరం అని ఆయన చివరి క్షణాలలో చెప్పిన మాటలు నాలో సదా మారుమోగుతుంటాయి. శ్రీ గద్దర్ గారి జయంతి సందర్భంగా నా పక్షాన, జనసేన (Janasena) పక్షాన ఆయనకు నివాళి అర్పిస్తున్నాను. అంటూ పవన్ కళ్యాణ్ గద్దర్ కు నివాళులు అర్పించారు. రవీంద్రభారతిలో ఘనంగా జరుగుతున్న గద్దర్ జయంతి వేడుకలు ఉద్యమకారుడిగా, మహా విప్లవ కవిగా తన జీవితాన్ని బడుగు బలహీనవర్గాల కోసం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి గద్దర్(Gaddar). తుది శ్వాశ వరకు అణగారిన వర్గాల కోసమే పాటుపడి, తన పాట(Song) తో జనం గుండెల్లో చిరస్తాయిగా నిలిచిపోయిన ప్రజా గాయకుడు గద్దర్ జయంతి వేడుకలను ( జనవరి 31)న అధికారికంగా నిర్వహించాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకోవడంతో గద్దర్ అభిమానులు , కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ జయంతి వేడుకలు ఈ రోజు రవీంద్రభారతిలో ఘనంగా జరుగుతున్నాయి. గాయకులు , కళాకారులు గద్దర్ పాటలను పాడుతూ ఆయన జ్ఞాపకాలు స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు సమాజంలో ఉన్న అంతరాలు తొలగించాలని తన జీవితాంతం పరితపించి, తన గళంతో జనాలలో చైతన్య స్ఫూర్తిని రగిలించారని ఈ సందర్భంగా గద్దర్ సేవలను గుర్తు చేశారు. ALSO READ:అధికారికంగా ప్రజా గాయకుడు గద్దర్ జయంతి వేడుకలు #pawan-kalyan #janasena #janasena-chief-pawan-kalyan #gaddar-jayanti మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి