ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ జూన్ 19న బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవల ఆయనకు డిప్యూటీ సీఎంతో సహా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేచాయించిన సంగతి తెలిసిందే. జూన్ 12 న పవన్ కల్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. పవన్‌కు డిప్యూటీతో సహా హోంశాఖ ఇస్తారని ప్రచారాలు జరిగాయి. కానీ పవన్ కల్యాణ్ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు, వారికి ఎల్లప్పుడు అందుబాటులో ఉండేందుకు ఈ శాఖలను ఎంచుకున్నట్లు ఆయనే క్లారిటీ ఇచ్చారు.
Also Read: వారి ఒత్తిడితోనే రాజీనామా.. విధుల్లో చేర్చోకోవాలని వాలంటీర్ల వేడుకోలు!