Ramoji Rao: రామోజీరావును ఇబ్బంది పెట్టారు: పవన్‌ కల్యాణ్

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు పార్థివదేహానికి జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్ నివాళులర్పించారు. రామోజీని గత 15 ఏళ్లలో ప్రభుత్వాలు ఇబ్బందులు పెట్టాయని అన్నారు. ప్రమాణస్వీకారం తర్వాత కలద్దామనుకున్నానని అంతలోనే ఇలా జరిగిపోయిందని విచారం వ్యక్తం చేశారు.

New Update
Ramoji Rao: రామోజీరావును ఇబ్బంది పెట్టారు: పవన్‌ కల్యాణ్

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు పార్థివదేహానికి జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రాగడ సానభూతి తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ' ప్రభుత్వాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా రామోజీరావు తట్టుకొని నిలాబడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది జర్నలిస్టులు ఈనాడు జర్నలిజం స్కూల్‌ నుంచే వచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయడంలో ఆయన పాత్ర ఎంతగానో ఉంది. రామోజీని గత 15 ఏళ్లలో ప్రభుత్వాలు ఇబ్బందులు పెట్టాయి. ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు ఈరోజు లేవు. ఈ విషయాన్నే ఆయనకు తెలియజేయాలని అనుకున్నాను. ప్రమాణస్వీకారం అనంతరం కలుద్దామని అనుకున్నా. కానీ ఇలా జరిగిపోయిందని' పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Also read: రామోజీరావుకు ఎస్పీ బాలు అంటే చాలా ఇష్టం.. స్నేహితుడి కోసం రామోజీ ఏం చేశాడంటే?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు