/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-76.jpg)
Janaka Aithe Ganaka Movie : సుహాస్ హీరోగా దిల్ రాజు బ్యానర్ పై తెరకెక్కిన తాజా చిత్రం 'జనక అయితే గనక'. సందీప్ రెడ్డి బండ్ల డైరెక్ట్ చేసిన ఈ మూవీ సెప్టెంబర్ 7 న రిలీజ్ కాబోతుంది. రిలీజ్ కు ఒక్క రోజు ముందు ప్రీమియర్స్ ను సైతం మూవీ టీమ్ ప్లాన్ చేసింది. అయితే రిలీజ్ కు ఇంకా మూడు రోజులు ఉందనగా ఉన్నట్టుండి వాయిదా వేశారు.
'జనక అయితే గనక' మూవీ సేఫ్ సెప్టెంబర్ 7 రిలీజ్ కావట్లేదని, ఇందుకు కారణం తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలే అని మేకర్స్ అధికారికంగా తెలిపారు. వర్షాల వల్ల జనాలు పెద్దగా బయటకు రావట్లేదు. అందుకే గతవారం థియేటర్లలో రిలీజైన 'సరిపోదా శనివారం' సినిమాకు పెద్ద దెబ్బ పడింది.
Due to the ongoing floods and situation, #JanakaAitheGanaka team is pushing the release date from September 7th…will soon meet you. pic.twitter.com/FHU6muq1Vf
— Dil Raju Productions (@DilRajuProdctns) September 4, 2024
Also Read : ‘దేవర’ థర్డ్ సింగిల్.. ఎన్టీఆర్, జాన్వీ స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా
మరోసారి తెలుగు రాష్ట్రాలకు వర్షం పోటెత్తనుందనే హెచ్చరిక వచ్చింది. 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడబోతున్నాయని న్యూస్ రావడంతో దిల్ రాజు అండ్ టీమ్ 'జనక అయితే గనక' మూవీ రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని వెల్లడించారు.