కుల్గాంలో ఎన్‌ కౌంటర్‌ ..ముగ్గురు జవాన్లు మృతి!

జమ్మూ కశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో శుక్రవారం రాత్రి ఎన్‌ కౌంటర్‌ జరిగింది. ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు సైనికులు మృతి చెందినట్లు భారత సైన్యం తెలిపింది. హలాన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం అందుకున్న భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ నిర్వహించాయి.

కుల్గాంలో ఎన్‌ కౌంటర్‌ ..ముగ్గురు జవాన్లు మృతి!
New Update

Jammu Kashmir Encounter: జమ్మూ కశ్మీర్ లోని కుల్గాం(Kulgam) జిల్లాలో శుక్రవారం రాత్రి ఎన్‌ కౌంటర్‌ జరిగింది. ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు సైనికులు(Army) మృతి చెందినట్లు భారత సైన్యం తెలిపింది. హలాన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం అందుకున్న భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ నిర్వహించాయి.

గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరపగా భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలు కాగా, ఆ తర్వాత వారు మరణించినట్టు ఆర్మీ తెలిపింది. ఎదురుకాల్పుల ఘటన అనంతరం ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగిస్తున్నామని శ్రీనగర్ ప్రాంతానికి చెందిన చీనార్ కార్ప్ ఆర్మీ ట్వీట్ చేసింది.

మరణించించిన సిబ్బంది చేతిలో ఉన్న నాలుగు ఏకే-47 రైఫిళ్లను ఓ ఉగ్రవాది లాక్కెళ్లాడు. ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల గాలింపు కాస్తా ఎన్‌కౌంటర్‌గా మారిపోవడంతో ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.

దీంతో హుటాహుటిన వారిని దవాఖానకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ వారు మరణించారని శ్రీనగర్‌ కేంద్రంగా పనిచేస్తున్న చినార్‌ కార్ప్స్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా వెల్లడించింది. కాగా, ఏప్రిల్, మే నెలల్లో పూంచ్, రాజౌరీ జిల్లాల్లో జరిగిన ఉగ్రదాడుల్లో పదిమంది జవాన్లు అమరులయ్యారు.

Also Read: లోయలో పడిన బస్సు..18 మంది మృతి..వారిలో ఆరుగురు భారతీయులు!

#encounter #army-jawans #jammukashmir #jammukashmir-encounter #3-army-soldiers-killed-in-encounter-with-terrorists-in-jk #three-army-personnel-killed-in-encounter #jammu-and-kashmir-encounter #kulgam-encounter
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe