jammu $ Kashmir: జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్రం కీలక నిర్ణయం!

మరికొన్ని రోజుల్లో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల జరగనుండగా కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. టెర్రరిస్ట్ యాక్టవిటీస్ అరికట్టేందుకు భద్రతా దళాలు కూంబింగ్ వేగవంతం చేయాలని అత్యవసర భేటీలో నిర్ణయించింది.

New Update
jammu $ Kashmir: జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్రం కీలక నిర్ణయం!

Assembly elections: సెప్టెంబర్ 2024లో జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాద కార్యకాలాపాలు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జమ్ముూ కశ్మీర్‌లో టెర్రరిస్ట్ యాక్టవిటీస్ అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదివారం జమ్మూ కశ్మీర్‌లోని సమస్యలపై కేంద్ర ప్రభుత్వం అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ అత్యవసర భేటీలో భద్రతా దళాలు కూంబింగ్ వేగవంతం చేయాలని కేంద్ర హోంశాఖ సూచించింది.

జమ్ముకశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు సెప్టెంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్‌డిఎ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జేడీ(యు) పార్టీ జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 40 స్థానాల్లోనైనా పోటీ చేయడానికి నిర్ణయించింది. 2014లో జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పీడిపి సంకీర్ణ ప్రభుత్వం అధికారం లోకి వచ్చినా 2018లో ఈ ప్రభుత్వం పడిపోయింది. జమ్ముకశ్మీర్‌లో నేషనల్ కాంగ్రెస్, కాంగ్రెస్, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ, బీజేపీ కీలకమైన రాజకీయ పార్టీలుగా ఉంటున్నాయి.

Advertisment
తాజా కథనాలు