Anderson : ఇంగ్లాండ్(England) పేసర్ జేమ్స్ అండర్సన్(James Anderson) 147 ఏళ్ల టెస్టు క్రికెట్(Test Cricket) చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో 700లకు పైగా వికెట్లు తీసిన టాప్ 3 బౌలర్ల జాబితాలో చోటు సంపాదించుకున్న జెమ్మీ అత్యధిక వికెట్లు తీసిన తొలి పేసర్‌గా రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. భారత్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్ లో రెండు వికెట్లు తీసిన అనంతరం ఈ మైలురాయిని చేరకున్నాడు.
700 వికెట్ల జాబితాలో..
ఈ మేరకు 41 ఏళ్ల వయసులో కుర్రాళ్లతో పోటీపడుతూ బౌలింగ్ చేస్తున్న జెమ్మీ.. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో శుభ్‌మన్ గిల్, కుల్‌దీప్ యాదవ్‌ను ఔట్ చేసిన అండర్సన్ 700 వికెట్ల జాబితాలో చేరాడు. అంతకుముందు ముత్తయ్య మురళీ ధరన్ 800, షేన్ వార్న్ 709 వికెట్లతో ముందుండగా అండర్సన్ మరో 10 వికెట్లు తీస్తే వార్న్‌ను అధిగమిస్తాడు.
ఇది కూడా చదవండి: Ashwin: జంబో రికార్డు బద్దలు కొట్టిన స్పిన్ మాంత్రికుడు.. తొలి భారత బౌలర్!
ఇంగ్లాండ్ తరఫున అత్యధిక వికెట్లు..
ఇక 2002లో అంతర్జాతీయ క్రికెట్(International Cricket) లోకి అడుగుపెట్టిన ఈ పేసర్.. ఇప్పటివరకు 187 టెస్టులకు ప్రాతినిధ్యంవహించాడు. 32 సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేయగా అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 7/42గా ఉన్నాయి. అంతేకాదు ఇంగ్లాండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన తొలి బౌలర్‌గానూ రికార్డు క్రియేట్ చేశాడు. ఇటీవల రిటైర్ మెంట్ ప్రకటించిన స్టువర్ట్ బ్రాడ్ 604 వికెట్లతో ఇంగ్లాండ్ బౌలర్లలో రెండో స్థానంలో ఉన్నాడు.