Jallikattu: జల్లికట్టు పోటీలు ప్రారంభం.. పెద్దఎత్తున తరలివస్తున్న జనాలు..

తమిళనాడులో జల్లికట్టు పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ క్రీడలను చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. అవనియాపురంలో ఈ పోటీల నిర్వహణ కోసం ముమ్మురంగా ఏర్పాట్లు చేశారు.

New Update
Jallikattu: జల్లికట్టు పోటీలు ప్రారంభం.. పెద్దఎత్తున తరలివస్తున్న జనాలు..

తమిళనాడులో జల్లికట్టుకు ఉండే క్రేజ్‌ మాములుగా ఉండదు. మూడు రోజుల పాటు జరిగే ఈ క్రీడల్లో చిన్నా పెద్దా అందరూ కలిసి పెద్దఎత్తున పాల్గొంటారు. అయితే ఈ పోటీల నిర్వహణకు మధురై జిల్లా అవనియాపురంలో ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. ఈ జల్లికట్ట నిర్వహణకు ముందుగా పోటీలో పాల్గోనే ఎద్దులకు హెల్త్‌ చెకప్‌ చేశారు. అయితే ఈ జల్లుకట్టు అనేది తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో ఆడే ఒక సంప్రదాయ క్రీడ. ఈ ఆటలో ఎద్దులకు, మనుషులకు మధ్య పోరాటం జరుగుతుంది.

Also Read: బద్దలైన అగ్నిపర్వతం.. కాలిబుడిదైన ఇళ్లు..

ఈ పోటీల్లో పాల్గొనేవారు కొన్నిసార్లు తీవ్రంగా గాయపడుతుంటారు. అయితే దీన్ని గమనించిన సుప్రీంకోర్టు ఈ జల్లికట్టు నిర్వహణకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినా కూడా జల్లికట్టు పోటీల సమయంలో కొందరు గాయలపాలవుతున్నారు. గత ఏడాది కూడా అవనీయపురంలో జల్లికట్టు పోటీలు నిర్వహించగా.. అందులో దాదాపు 60 మంది గాయాలపాలయ్యారు.

ఇదిలాఉండగా.. మధురై జల్లికట్టు స్టేడియం ప్రారంభానికి సిద్ధమైపోయింది. జనవరి 23న ఆ మైదానాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రారంభించనున్నారు. మధురై జిల్లాలో అలంగనల్లూరు దగ్గర్లో నిర్మించిన ఈ జల్లికట్టు స్టేడియానకి తమాళినాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పేరు పెట్టారు.

Also Read: అక్కడికి రాముడొక్కడే కాదు.. వేలాది కోట్ల పెట్టుబడులు కూడా 

Advertisment
తాజా కథనాలు