Jail for GST Officer: లంచం కేసులో జీఎస్టీ అధికారికి మూడేళ్ళ జైలు.. ఒక వ్యక్తి టాక్స్ ల విషయంలో సహాయం చేయడానికి లంచం తీసుకున్న కర్ణాటకకు చెందిన జీఎస్టీ ఆఫీసర్ కు మూడేళ్ళ జైలు శిక్ష.. 5 లక్షల రూపాయల జరిమానా విధించింది సీబీఐ ప్రత్యేక కోర్టు. ఈ కేసు పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 14 May 2024 in బిజినెస్ క్రైం New Update షేర్ చేయండి Jail for GST Officer: మనదేశంలో లంచగొండులకు తక్కువేమీ లేదు. లంచం తీసుకుంటేనే కానీ, పని చేయని ఉద్యోగులు ఉన్నారంటే అది అతిశయోక్తి కాదు. అయితే, లంచం తీసుకుని పట్టుబడిన ఉద్యోగులు తాత్కాలికంగా జైలుకు వెళ్లినా.. తరువాత వారు నిర్దోషులుగా బయటకు రావడమో.. తక్కువ శిక్షతో తప్పించుకోవడమో జరుగుతూ ఉంటుంది సాధారణంగా. కానీ, కర్ణాటకలో ఒక వ్యక్తి టాక్స్ విషయంలో సహకరించడానికి లంచం తీసుకున్న జీఎస్టీ అధికారికి గట్టి శిక్ష విధించింది సీబీఐ ప్రత్యేక కోర్టు. లంచం తీసుకున్న కేసులో జీఎస్టీ అధికారికి సీబీఐ ప్రత్యేక కోర్టు మూడేళ్ల జైలుశిక్ష, రూ.5 లక్షల జరిమానా విధించింది . ఉత్తరప్రదేశ్‌కు చెందిన సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సెంట్రల్ ట్యాక్సేషన్ (జిఎస్‌టి) సూపరింటెండెంట్ జితేంద్ర కుమార్ డాగూర్ ఒకరి టాక్స్ విషయంలో సహకరించినందుకు అదేవిధంగా, రూ. 25,000 లంచం తీసుకున్నందుకు ఈ శిక్ష విధించారు. ఈ కేసులో సదరు అధికారి దోషిగా తేలడంతో, మూడేళ్ళ జైలు శిక్ష పడింది. జరిమానా ఎందుకంటే.. Jail for GST Officer: ఈ కేసు విషయంలో డిపార్ట్మెంట్ పరిశోధనలు, విచారణల కోసం చాలా టాక్స్ పేయర్స్ డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది. అందుకే నిందితుడికి భారీ మొత్తంలో అంటే 5 లక్షల జరిమానా విధించినట్లు కోర్టు వెల్లడించింది. Also Read: సెక్స్ స్కాండల్ కేసు నిందితుడు రేవణ్ణకు బెయిల్! కేసు తీర్పు సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా డాగూర్ తన విధులను నిజాయితీగా, శ్రద్ధగా నిర్వర్తించాల్సి ఉంది. కానీ అలాంటి అధికారులు అవినీతికి పాల్పడితే అది పన్ను చెల్లింపుదారులకు తప్పుడు సందేశాన్ని పంపుతుంది. ఇలాంటి చర్యల వల్ల దేశ ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతింటుందని జస్టిస్ హెచ్‌ఏ మోహన్ తీర్పులో పేర్కొన్నారు. Jail for GST Officer: కర్ణాటక రాష్ట్రంలో ఉత్తర కన్నడ డివిజన్‌లోని హొన్నావర్ పరిధిలో పనిచేస్తున్నప్పుడు ఫిర్యాదుదారు జగదీష్ సుబ్రాయ్ భావే నుండి రూ. 25,000 లంచం తీసుకుంటుండగా డాగూర్ మార్చి 2021లో సీబీఐకి పట్టుబడ్డాడు. జగదీష్ పని పూర్తి చేయడానికి రెండు విడతల్లో మొత్తం రూ.50 వేలు ఇవ్వాలని డాగూర్ కోరాడు. దీంతో విసుగు చెందిన ఫిర్యాదుదారుడు తన మొబైల్ ఫోన్‌లో ఆడియో, వీడియో మోడ్‌లో సంభాషణలను రికార్డ్ చేసి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కి ఫిర్యాదు చేశాడు. అనంతరం అధికారులు అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి ఉచ్చు బిగించారు. #corrupt-officer #corruption మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి