/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-29T173336.945.jpg)
Jagapathi Babu Latest Video : టాలీవుడ్ సీనియర్ యాక్టర్ కం విలన్ జగపతి మోసపోయారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. అంతేకాదు తనకు జరిగిన ఈ మోసం మరెవ్వరికీ జరగకూడదని తాజాగా ఓ వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో జరిగిన మోసం గురించి బయటపెట్టాడు.
అసలేం జరిగిందంటే...
జగపతిబాబుని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ మోసం చేసిందట. ఈ విషయాన్ని తెలుపుతూ జగ్గూభాయ్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియోని పోస్ట్ చేసాడు. తనను మోసం చేసిన సంస్థ పేరు త్వరలోనే చెబుతానని అన్నాడు. అంతేకాకుండా జరిగిన మోసం గురించి వీడియోలో వివరించాడు.
Also Read : ‘విశ్వంభర’ సెట్స్ లో అజిత్.. 20 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ ను కలిసిన కోలీవుడ్ స్టార్!
నన్ను వాళ్ళు మోసం చేశారు
వీడియోలో జగపతిబాబు మాట్లాడుతూ.. " రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలు జరుగుతున్నాయి. తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కూడా రీసెంట్ గా ఈ విషయంలో హెచ్చరించారు. నేను ఇటీవల ఓ రియల్ ఎస్టేట్ యాడ్ లో నటించాను. నన్ను వాళ్ళు మోసం చేశారు. వాళ్ళు ఎవరు? అసలు ఏం జరిగింది?అనే వివరాలన్నీ త్వరలోనే చెబుతా.. ల్యాండ్ కొనే ముందు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (RERA )రూల్స్ ని కచ్చితంగా తెలుసుకోండి" అని పేర్కొన్నాడు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది.
నన్ను కూడా రియల్ ఎస్టేట్ వాళ్లు మోసం చేశారు, మీరూ జాగ్రత్తగా ఉండండి : Jagapathi Babu#JagapathiBabu #realestate #Telangana #TelanganaDecade
pic.twitter.com/p6MzMNG306— Tweety Papa 🐦 (@Tweety4tdp) May 29, 2024
ఇక జగపతిబాబు కెరీర్ విషయానికొస్తే.. తన సెకెండ్ ఇన్నింగ్స్ లో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా గుంటూరు కరం సినిమాలో నటించిన ఈయన.. ప్రస్తుతం రవితేజ మిస్టర్ బచ్చన్ లో విలన్ రోల్ చేస్తున్నాడు. తెలుగుతో పాటూ తమిళ్, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటిస్తున్నాడు.