Jagananna Vidya Deevena : జగనన్న విద్యా దీవెన(Jagananna Vidya Deevena) నిధులను విడుదల చేసేందుకు ఏపీ సీఎం జగన్(AP CM Jagan) ఇవాళ(మార్చి 1)కృష్ణా జిల్లా పామర్రులో పర్యటించనున్నారు. ఆన్‌లైన్ మోడ్ ద్వారా జగన్ నిధులను రిలీజ్ చేస్తారు. అక్టోబర్-డిసెంబర్(2023) త్రైమాసికానికి చెందిన డబ్బులను జమ చేస్తారు. మొత్తంగా 9,44,666 మంది తల్లులు, విద్యార్థుల జాయింట్ ఖాతాలలో నేరుగా రూ.708.68 కోట్లు జమ చేస్తారు. శుక్రవారం అందజేస్తున్న రూ.708.68 కోట్లతో కలిపి ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద వైసీపీ(YCP) ప్రభుత్వం రూ.18,002 కోట్లు నిధులను యూజ్ చేసింది.
ఫీజులను రీయింబర్స్ చేస్తోన్న ప్రభుత్వం:
రాష్ట్రంలో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదువుతున్న 93 శాతం మంది విద్యార్థులు విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందుతున్నారని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(Minister Botsa Satyanarayana) తెలిపారు. జగనన్న విద్యా దీవెన గురించి సత్యనారాయణ వివరిస్తూ పేద విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఒక కుటుంబంలో అర్హులైన పిల్లల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేకుండా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ మొదలైన విద్యార్ధుల కోసం ప్రభుత్వం వారి మొత్తం ఫీజులను త్రైమాసిక ప్రాతిపదికన రీయింబర్స్ చేస్తోందని తెలిపారు.
విద్యార్థుల చదువు ఖర్చులు మాత్రమే కాకుండా వారి భోజన, వసతి ఖర్చులను కూడా ప్రభుత్వం భరిస్తోందన్నారు బొత్స. ఇక డిగ్రీ, మెడిసిన్, ఇంజినీరింగ్ విద్యార్థులకు రూ. 20 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ. 15 వేలు, ఐటీఐ విద్యార్థులకు రూ. 10 వేలు ప్రతి విద్యా సంవత్సరంలో రెండు విడతలుగా - విద్యా సంవత్సరం ప్రారంభంలో ఒకసారి, ఆ తర్వాత చివర్లో ఆర్థిక సహాయం అందిస్తోది వైసీపీ సర్కార్. తల్లులు, విద్యార్థులు తమ ఖాతాల్లో నగదు జమ అయిన తర్వాత వారం లేదా 10 రోజుల్లోగా కళాశాల ఫీజు చెల్లించాలని అధికారులు కోరుతున్నారు. అలా చేయని పక్షంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ తదుపరి విడత నేరుగా కళాశాలల ఖాతాలకు చెల్లిస్తారు.
Also Read : అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు వేరుశెనగ తినవచ్చా?