ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం విశాఖలో పర్యటించనున్నారు. విశాఖ పట్నంలో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. దీని కోసం జగన్ మంగళవారం ఉదయం తాడేపల్లి నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ కు బయల్దేరతారు.
అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కైలాసపురంలో పోర్టు ఆసుపత్రి వద్దకు చేరుకుంటారు. అక్కడ దేశంలోనే అతి పెద్దదైన షాపింగ్ మాల్ ఇనార్బిట్ మాల్ కు శంకుస్థాపన చేస్తారు. విశాఖకు ఇనార్బిట్ మాల్ రావడాన్ని చరిత్రాత్మక అంశంగా ఏపీ ప్రభుత్వం చెబుతోంది. అనంతరం అక్కడ హైటీ కార్యక్రమంలో పాల్గొంటారు.
దీనిని 2026 నుంచి ప్రజలకు అందుబాటులోనికి తీసుకురావాలని రహేజా గ్రూపు నిర్దేశించుకుంది. 250 కి పైగా అంతర్జాతీయ బ్రాండ్లకు వేదికగా మారనున్న ద్వారా 8,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. మాల్ నిర్మాణం కోసం పోర్టు అథారిటీకి చెందిన 17 ఎకరాలను 30 సంవత్సరాల పాటు లీజుకు తీసుకున్నారు.
రెండో దశలో ఐటీ క్యాంపస్ ను అభివృద్ధి చేస్తారు. తదుపరి జీవీఎంసీ ఆధ్వర్యంలో నగరంలో చేపట్టనున్న 50 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రెండో దశలో ఐటీ క్యాంపస్ ను అభివృద్ధి చేస్తారు. 3000 మంది పని చేసే విధంగా సుమారు 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ క్యాంపస్ ను 2027 నాటికి పూర్తి పర్యావరణహితంగా భవనాన్ని నిర్మించనున్నట్లు రహేజా గ్రూపు వెల్లడించింది.
అనంతరం అక్కడి నుంచి బయల్దేరి సిరిపురం కూడలిలోని ఏయూ ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ ఎలిమెంట్ ఫార్మా ఇంక్యుబేషన్, బయో మోనిటరింగ్ హబ్‌తో పాటు మరో నాలుగు భవనాలను ప్రారంభిస్తారు. అనంతరం ఏయూ నుంచి బయల్దేరి బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ కు వెళ్లునున్నారు.
అక్కడ విద్యార్థులతో జరిగే ముఖాముఖిలో పాల్గొంటారు. అనంతరం కార్యక్రమాలు అన్ని ముగించిన తరువాత తిరిగి 12 గంటల సమయంలో కన్వెన్షన్ సెంటర్ నుంచి బయల్దేరి విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం ప్రత్యేక విమానంలో విజయవాడ బయల్దేరి వెళ్తారు. అక్కడ నుంచి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.