TS Congress MLA : అలాంటోళ్లు నా దగ్గరకి రావొద్దు.. వైరల్ అవుతున్న కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే వీడియో జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొత్త ప్రభుత్వం వస్తే వారి దగ్గరకు పోయి దందాలు, బిజినెస్ చేసుకునే వారు తన వద్దకు రావొద్దని ఏకంగా ప్రెస్ మీట్లో కోరారు అనిరుధ్. అలాంటి వారు తనకు ఫోన్ కూడా చేయొద్దన్నారు. By Nikhil 14 Dec 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి Congress MLA : ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections 2023) జడ్జర్లలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డిపై విజయం సాధించి సంచలనం సృష్టించారు అనిరుధ్ రెడ్డి (Anirudh Reddy). అయితే.. ఇటీవల నిర్వహించిన ఓ ప్రెస్ మీట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొంత మంది కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే అక్కడికి వెళ్లి బిజినెస్ లు చేసుకుంటారని అన్నారు. అలాంటి వాళ్లు తనకు అవసరం లేదన్నారు. బిజినెస్ లు, దందాలు చేసుకునే వారు తన వద్దకు రావొద్దన్నారు. అలాంటి వారు దయచేసి తన వద్దకు రావొద్దని, ఫోన్లు కూడా చేయవద్దని ప్రెస్ మీట్లోనే కోరారు. ఇది కూడా చదవండి: Bandi Sanjay: కరీంనగర్ లో బండి సంజయ్ కు సీనియర్ల షాక్.. ఎంపీ టికెట్ ఇవ్వొద్దని డిమాండ్? తాను గెలిచిన తర్వాత అలాంటి వారే ఎక్కువగా తనకు ఫోన్ చేయడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. తనను తిట్టిన వారు.. నీ స్థాయి ఎంత అని విమర్శించిన వారు తనకు ఫోన్ చేస్తున్నారన్నారు. అయితే.. వారి ఫోన్లను తాను ఎత్తనన్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎమ్మెల్యే చేసిన ప్రకటన బాగుందని నెటిజన్లు అభినందిస్తున్నారు. ఏపార్టి అధికారంలో వుంటే ఆపార్టీలోకి వెళ్లే దొంగలు,మాపార్టీ లోకి వద్దు మాకు ఫోన్ చేయకండి.కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ నిజమైన కార్యకర్తలు చాలా మంది ఉన్నారు మాదగ్గర..👍😄 జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఎమ్మెల్యే జడ్చర్ల నియోజకవర్గo pic.twitter.com/I2zr2jZ9P5 — Narsimha Kodangal (@Narsimha_Bagari) December 14, 2023 ఇదిలా ఉంటే.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా జడ్జర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన అనిరుధ్ రెడ్డి 90,865 ఓట్లు సాధించి బీఆర్ఎస్ అభ్యర్థి అయిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డిపై 15,171 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. లక్ష్మారెడ్డికి 75,694 ఓట్లు రాగా.. బీజేపీ నుంచి పోటీ చేసిన చిత్తరంజన్ దాస్ కు 7312 ఓట్లు వచ్చాయి. #congress #viral-video #mla #anirudh-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి