RP Vs Roja : మంత్రి రోజాపై కిర్రాక్ ఆర్పీ సంచలన కామెంట్స్.. ఆస్కార్ యువరాణి అంటూ!

పవన్ కోసం ప్రచారం చేస్తున్న జబర్దస్త్ కమెడియన్లపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై కిర్రాక్ ఆర్పీ మండిపడ్డాడు. రోజా తమను గౌరవిస్తే రోజాగారని పిలుస్తాం. లేదంటే రోజా అంటామని హెచ్చరించాడు. 'మేము చిన్న ఆర్టిస్టులమైతే నీవేమైనా 10ఆస్కార్ అవార్డులు సాధించావా?' అంటూ ఫైర్ అయ్యాడు.

New Update
RP Vs Roja : మంత్రి రోజాపై కిర్రాక్ ఆర్పీ సంచలన కామెంట్స్.. ఆస్కార్ యువరాణి అంటూ!

Minister Roja : ఏపీ ఎన్నికల ప్రచారం(Election Campaign) లో భాగంగా మంత్రి రోజా(Roja) పై జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ(Kirak RP) సంచలన కామెంట్స్ చేశాడు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ తరుఫున ప్రచారం చేస్తున్న జబర్దస్త్ నటులు హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనులపై రోజా చేసిన కాంట్రవర్సీ కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. రోజా తమను గౌరవిస్తే రోజాగారని పిలుస్తామని లేదంటే రోజా అంటామంటూ హెచ్చరించాడు.

అసలు విషయానికొస్తే.. పిఠాపురం(Pithapuram) లో పవన్ కోసం జబర్దస్త్(Jabardasth) నటులు ప్రచారం చేస్తూ జనసేనానిని గెలిపించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో జబర్దస్త్ కమెడియన్లపై రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. 'వాళ్లంతా చిన్నచిన్న ఆర్టిస్టులు.. డబ్బుల కోసం పనిచేసేవాళ్లు. మెగా ఫ్యామిలీకి ఎదురెళితే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారని భయంతోనే జనసేనకు ప్రచారం చేస్తున్నారు' అని రోజా అన్నారు. దీంతో గెటప్ శ్రీను ఇప్పటికే కౌంటర్ ఇవ్వగా తాజాగా ఆర్పీ ఫైర్ అయ్యాడు.

నీకు దమ్ముంటే అలా చేయ్..
'మేమంతా చిన్నచిన్న ఆర్టిస్టులైతే నీవేమైనా 15 నేషనల్ అవార్డులు, 10 ఆస్కార్ అవార్డులు కొట్టిన యువరాణివా. స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ప్రచారం చేస్తున్నారు. టీడీపీ మీద ఇష్టం ఉంది. మీ ప్రభుత్వంపైన వ్యతిరేకత ఉంది. చిన్నచిన్నఆర్టిస్టులు అంటున్నావ్. నీకు దమ్ముంటే గెటప్ శ్రీను వేసే క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ జీవితంలో ఒక్కటైనా చేయగలవా? సుడిగాలి సుధీర్ మ్యాజిక్ చేసి కష్టపడి పైకొచ్చాడు. సినిమా హీరోగా చేస్తున్నాడు. నీ కంటే పదిరెట్లు ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. వాడితో నువ్వు పోటీపడగలవా? ఆది జబర్దస్త్ చరిత్రనే మార్చేశాడు. వాడిలా నువ్వు గంటసేపు నవ్వించగలవా? నీ బతుకులో వీళ్ల ముగ్గురిలాంటి ఛరిష్మాను చూశావా?' అంటూ కిరాక్ ఆర్పీ ఫైర్ అయ్యాడు.

ఇది కూడా చదవండి: Homo Sex: ఓరి దరిద్రుడా.. 50 మందికి ఎయిడ్స్ అంటించిన హోమో సెక్సర్.. ఎలాగంటే!

అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ఫస్ట్ ఓడిపోయే సీటే నగరి. నగరిలో రోజాకు డిపాజిట్లు కూడా రావు. జనసేనలో ఏడు మంది హీరోలు ఉంటే.. రోజా వాళ్ల అన్నల దగ్గర 70 మంది రౌడీలు ఉన్నారు. నీకు దమ్ముంటే వారిని ఎదిరించి చూడు. లేపేస్తారు. ఆవిడను గౌరవించాం. నీ పని నువ్వు చూస్కో. ఎవరూ ఏమీ అనలేదు. ఎందుకు ఉలికిపడుతున్నావ్. వాళ్లు స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్‌కు ప్రచారం చేస్తున్నారు. నీలాగా దిగజారిపోయి బతకడం లేదు. నోరు మూసుకుని నీ ప్రచారం నువ్వు చేస్కో. వీలైతే జనసేనకు సపోర్ట్ చేయి. బాగుంటుంది. జూన్ నాలుగో తేదీన అందరి లెక్కలు తేలుస్తామంటూ సవాల్ విసిరాడు. చివరగా కూటమి అధికారంలోకి రావటం ఖాయమన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు