Raju Yadav: ఓటీటీలో గెటప్ శ్రీను 'రాజు యాదవ్ '.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..?

జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'రాజు యాదవ్'. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ 'ఆహా'లో జులై 24 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం.

New Update
Raju Yadav: ఓటీటీలో గెటప్ శ్రీను 'రాజు యాదవ్ '.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..?

Raju Yadav : కృష్ణమాచారి దర్శకత్వంలో జబర్దస్త్ (Jabardasth) ఫేమ్ గెటప్ శ్రీను (Getup Srinu) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'రాజు యాదవ్'. ఈ ఏడాది మే 24న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది.

'రాజు యాదవ్' ఓటీటీ రిలీజ్

తాజాగా 'రాజు యాదవ్'  (Raju Yadav) ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ 'ఆహా' (Aha) లో జులై 24 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం. చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్, సాయి వరుణవి క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ అంకిత ఖారత్ (Ankita Kharat) కథానాయికగా నటించగా.. ఆనంద్‌ చక్రపాణి, రాకెట్‌ రాఘవ, మిర్చి హేమంత్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

మూవీ స్టోరీ

ఈ సినిమాలో హీరో రాజ్ యాదవ్ కు ఒక గేమ్ ఆడుతుండగా అనుకోకుండా ముఖానికి గాయం అవుతుంది. దీంతో అతని మొహానికి సర్జరీ చేస్తారు డాక్టర్లు. ఇక ఆ సర్జరీ తర్వాత రాజ్ యాదవ్ మొహం ఏడ్చినా, కోపంలో ఉన్నా... నవ్వినట్లే కనిపిస్తుంది. ప్రతీ ఎమోషన్ కు అతని మొహం పై నవ్వే కనిపిస్తుంది. ఇక దీని వల్ల రాజ్ యాదవ్ తన జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు అనేది మూవీ స్టోరీ.

Also Read:Brahmamudi: రాజ్- కావ్య డిన్నర్ ప్లాన్.. రుద్రాణి కుట్రకు బలైన రాహుల్..! - Rtvlive.com


Advertisment
తాజా కథనాలు