Brahmamudi: రాజ్- కావ్య డిన్నర్ ప్లాన్.. రుద్రాణి కుట్రకు బలైన రాహుల్..! రాజ్ భార్య కావ్యను డిన్నర్ కు తీసుకెళ్లి తన ప్రేమ గురించి చెప్పాలని అనుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న రుద్రాణి రాజ్- కావ్య డిన్నర్ ప్లాన్ చెడగొట్టడానికి కుట్ర చేస్తుంది. మరో వైపు కళ్యాణ్ అప్పుతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. By Archana 20 Jul 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Brahmamudi: ఈరోజు ఎపిసోడ్ లో రాజ్ కావ్యను డిన్నర్ తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తాడు. కానీ ఆ విషయం కావ్యతో ఎలా చెప్పాలని మొహమాటంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంతలో కావ్య ఏదైనా చెప్పాలా అని అడుగుతుంది. దాంతో రాజ్ డిన్నర్‌కు తీసుకెళ్తున్నాను రెడీ అవ్వు అని చెప్తాడు. దానికి కావ్య ఏంటీ డిమాండా.? రిక్వెస్టా.? ఒక భార్య ను భర్త ఎలా డిన్నర్ కు పిలుస్తాడో అలా అడగండి అప్పుడు ఆలోచిస్తాను అని బెట్టు చేస్తుంది. ఇక ఎలాగైనా కావ్యను డిన్నర్ కు తీసుకెళ్లి తన ప్రేమను చెప్పాలనుకున్న రాజ్.. తన ఈగోను పక్కన పెట్టి ప్రేమగా కావ్యను డిన్నర్ కు రమ్మని అడుగుతాడు. దాంతో కావ్య వస్తానని చెప్తుంది. ఇందంతా చాటుగా విన్న రుద్రాణి తట్టుకోలేకపోతుంది. రాజ్,కావ్య ఒకటైతే ఇక తన ఆటలు సాగవని కన్నింగ్ ప్లాన్ వేస్తుంది. రాజ్ డిన్నర్ ప్లాన్ చెడగొట్టాలని కొడుకు రాహుల్ తో కలిసి కుట్ర చేస్తుంది. రుద్రాణి, రాహుల్ కుట్ర గురించి తెలుసుకున్న స్వప్న వారిద్దరి ప్లాన్ బెడిసికొట్టేలా చేస్తుంది. రాహుల్ కు జ్యూస్ లో మోషన్ పౌడర్ కలిపి ఇస్తుంది. ఇక రాజ్ , కావ్య డిన్నర్ వెళ్తుండగా.. రాహుల్ వారిద్దరిని ఆపుతాడు. ఆఫీస్ అర్జెంట్ మీటింగ్ ఉంది ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని రాజ్ తో చెప్తాడు. దాంతో రాజ్ అంత ముఖ్యమైనది అయితే డాడ్, బాబాయి నాతో చెప్పేవారు కదా అని అంటాడు. అయిన సరే రాహుల్ వినకుండా రాజ్ ప్లాన్ క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఇక ఇంతలో రాహుల్ కడుపులో గడబడ మొదలవుతుంది. స్వప్న ప్లాన్ ప్రకారం రాహుల్ మోషన్స్‌తో తంటాలు పడుతుంటాడు. దాంతో రాజ్ కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరో వైపు కళ్యాణ్ అప్పుతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. తన ఫోన్ చేసి మాట్లాడడం మొదలు పెడతాడు. కానీ అప్పు మాత్రం కళ్యాణ్ తో మాట్లాడడానికి ఇష్టపడడు. తనకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని ఇంకోసారి కాల్ చేయవద్దని కళ్యాణ్ తో చెప్పేస్తుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది ముగుస్తుంది. Also Read: Shraddha Kapoor: నేను అప్పుడే పెళ్లి చేసుకుంటా.. ? పెళ్లి పై శ్రద్ధ కపూర్ క్లారిటీ..! - Rtvlive.com #brahmamudi-serial #brahmamudi-serial-today-episode మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి