/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-96.jpg)
Jabardasth Comedian Rocking Rakesh : జబర్దస్త్ షో ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాకేష్, తన కామెడీ టైమింగ్ మరియు స్కిట్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆయన పలు షోలలో కూడా పాల్గొంటూ బిజీగా ఉన్నారు. త్వరలో హీరోగా కూడా అలరించబోతున్నాడు. కాగా రాకేష్.. జొర్ధార్ సుజాతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
గత సంవత్సరం ఫిబ్రవరిలో సుజాతను వివాహం చేసుకున్న రాకేష్, త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని సుజాత తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేసింది. ఈ మేరకు అందుకు సంబంధించి ఓ వ్లోగ్ కూడా చేసింది. ఇందులో రాకేష్ తల్లి సైతం తన కొడుకు తండ్రి కాబోతుండటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది.
Also Read : ఊహించని వివాదంలో చిక్కుకున్న సుమ కనకాల.. ఏం జరిగిందంటే?
ప్రస్తుతం తనకు తొమ్మిదో నెల నడుస్తుందని, వచ్చే నెల్లో డెలివరీ అని కూడా చెప్పింది. ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో టాప్-1 ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఈ జంట తల్లి దండ్రులు కాబోతున్నారనే విషయం తెలిసి రాకేష్-సుజాత జంటకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
View this post on Instagram