Madhyapradesh: మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ (Jabalpur) లో జరిగిన జంట హత్యలు కలకలం రేపాయి.సివిల్ లైన్స్‌లోని వారి ఫ్లాట్‌లో రైల్వే ఉద్యోగి, అతని ఎనిమిదేళ్ల కొడుకు హత్యకు గురయ్యారు. నిందితుడు 8 ఏళ్ల బాలుడ్ని నరికి ఫ్రిడ్జ్ లో పెట్టాడు. ఈ సంఘటనలో ఉద్యోగి కుమార్తె కనిపించకుండా పోయింది. ఆమె సెల్‌ఫోన్ నుంచి ఈ హత్యలు చేసినట్లు బంధువుల్లో ఒకరికి వాయిస్ మెసేజ్ పెట్టడంతో హత్యల విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో ముకుల్ సింగ్ అనే యువకుడే హంతకుడు అని తేలింది.
రైల్వే మిలీనియం కాలనీ, సివిల్ లైన్స్‌లో నివసిస్తున్న రాజ్‌కుమార్ విశ్వకర్మ, అతని ఎనిమిదేళ్ల కుమారుడు తనిష్క్ హత్యకు గురయ్యారని జబల్పూర్ ఎస్పీ ఆదిత్య ప్రతాప్ సింగ్ తెలిపారు. గత ఏడాది సెప్టెంబరులో ముకుల్ సింగ్ అనే యువకుడిపై అతని కుమార్తె తరఫున సెక్షన్ 363 కింద కేసు నమోదైంది. ముకుల్ సింగ్‌పై సెక్షన్ 363, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల తర్వాత నిందితుడు బెయిల్‌పై విడుదలయ్యాడు
ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, మరణించిన రాజ్‌కుమార్ విశ్వకర్మ సోదరుడి కుమార్తె ఫోన్‌కు వాయిస్ సందేశం వచ్చింది. అందులో రాజ్‌కుమార్ విశ్వకర్మ 14 ఏళ్ల కుమార్తె ఆర్య తన తండ్రి, సోదరుడిని ముకుల్ హత్య చేసినట్లు చెప్పింది. ఎస్పీ ఆదిత్య ప్రతాప్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులు వచ్చి ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా రాజ్ కుమార్ విశ్వకర్మ ఓ గది సోఫాలో శవమై కనిపించాడు. అదే సమయంలో ఫ్రిజ్‌లో కుమారుడి మృతదేహం లభ్యమైంది.
ఈ సంఘటన తర్వాత విశ్వకర్మ మైనర్ కుమార్తె కనిపించలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ వ్యవహారం అనుమానాస్పదంగా ఉంది. ప్రస్తుతం, అనుమానిత నిందితుడు ముకుల్ సింగ్‌తో పాటు అదృశ్యమైన రాజ్‌కుమార్ కుమార్తె కోసం అన్వేషణ కొనసాగుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు రాజ్‌కుమార్ విశ్వకర్మ రైల్వేలో ఆఫీస్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ కూతురు, కొడుకుతో కలిసి ఇక్కడే నివాసం ఉంటున్నాడు.
ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే ఎఫ్ఎస్ఎల్ బృందం, పోలీసు ఉన్నతాధికారులు కూడా ఘటనాస్థలికి చేరుకున్నారు.
Also read: అమెరికాలో ఏపీ విద్యార్థి దారుణ హత్య!