Vinesh Phogat: వినేశ్ ఫోగాట్...ఈరోజు భారతదేశం ఒక్కటే కాదు...ప్రపంచం అంతా వినిపిస్తున్న పేరు. ఆమె కోసం కోట్ల గళాలు గొంతెత్తి మాట్లాడుతున్న తరుణం. చివరి క్షణంలో పతకం కోల్పోవడమే కాక ఒలింపిక్స్ నుంచే అర్హతను కోల్పోయింది భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్. కేవలం వంద గ్రాముల బరువు ఆమె ఆటను తూకం వేసింది. ఇలాంటి సమయంలో మిగతా వాళ్ళు అయితే ఏడుస్తూ కూర్చునే వారు. సర్వం కోల్పోయాము అంటూ డిప్రెస్ అయిపోయేవారు. కానీ వినేశ్ అలా కాదు. అందరిలానే ఆమె చేస్తే ఆమె గురించి ఎందుకు ఇలా మాట్లాడుకునే వాళ్ళం. పడిన చోటే లేచిన కెరటం ఆమె. దానికి తగ్గట్టే తనకు జరిగిన దానికి రెస్పాండ్ అయింది.
జరిగిన దానిని వినేశ్ చాలా ధైర్యం తీసుకుంది. ఇదంతా ఆటలో భాగం అని...దానికి ఎవరు ఏం చేస్తారు అంటూ మిగతా ఆటగాళ్ళకు, కోచ్‌లకు చెప్పింది. నవ్వుతూ తనను తాను, మిగతా వారిని ఓదార్చింది. అదీ ఆమెకు మిగతా వారికి తేడా అని చెబుతున్నారు మరో క్రీడాకారిణి దహియా. చాలా మంది ఐఓఏ అధికారులు కూడా వినేశ్ ను కలవడానికి వస్తున్నారు. వారందరినీ రిసీవ్ చేసుకుంటూ వినేశ్ ధైర్యంగా మాట్లాడుతున్నారు అని చెప్పారు.
Also Read: Cricket: టీమ్ ఇండియాకు ఎదురుదెబ్బ..వన్డే సీరీస్ లంక కైవసం