బీజేపీ మాజీ ఎమ్మెల్యేను ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఇటీవల గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. అందుకే తాను గోషామహల్‌లో పర్యటించినట్లు ఈటల రాజేందర్ తెలిపారు. నియోజకవర్గంలో బీజేపీ నాయకులపై, కార్పోరేట్‌పై తప్పుడు కేసులు పెడుతూ బీఆర్‌ఎస్ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఈటల మండిపడ్డారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే దురుద్దేశంతో బీజేపీ నాయకులను బలవంతంగా బీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారని, తాము రామంటే ఉన్న కేసులను తిరిగి తోడుతామని బెదిరిస్తున్నారని రాజాసింగ్ అన్నట్లు ఎమ్మెల్యే ఈటల తెలిపారు. తాము ఇలాంటి బెదిరింపులకు బయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం బీజేపీ నాయకులపట్ల కక్ష్యపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
మరోవైపు రాజాసింగ్ సస్పెన్సన్ అంశం కేంద్ర పరిధిలో ఉందని ఈటల రాజేందర్ అన్నారు. రాజాసింగ్‌పై ఉన్న సస్పెన్సన్‌పై బీజేపీ అధిష్టానం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో గోషామహాల్‌లో మళ్లీ కాషాయ జెండానే ఎగురుతుందని ఈటల జోస్యం చెప్పారు. బీఆర్‌ఎస్ నాయకులు ఎన్ని ఎత్తుగడలు వేసినా, తల క్రిందకు కాళ్లుపైకి పెట్టినా గోషా మహల్ స్థానాన్ని దక్కించుకోలేదన్నారు. ఇక్కడ ఉన్నది అంతా బీజేపీ కుటుంబమని, బీజేపీ కుటుంబాన్ని బీఆర్‌ఎస్ వేరు చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అది జరిగే పని కాదన్నారు.
కాగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ ముస్లిం సోదరులను అగౌరవ పరిచేలా గతంలో వివాదాస్పద వీడియోను విడుదల చేయడంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అధిష్టానం.. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. ఎమ్మెల్యే అసభ్యకర వీడియోతో పాతబస్తీలో ఉద్రిక్తకర పరిస్ధితులు ఏర్పడ్డాయి. దీంతో అక్కడ దాదాపు వారం రోజుల పాటు అన్ని షాప్‌లో బంద్ కాగా స్పెషల్ బెటాలియన్ ఫోర్స్ వారం రోజులు అక్కడ గస్తీ నిర్వహించింది. యువత ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని పోలీసులు సూచించారు.