IT Raids: షిర్డీసాయి ఎలక్ట్రికల్స్​పై ఐటీ రైడ్స్ - రెండో రోజు కొనసాగుతున్నసోదాలు!

నగర శివారులోని షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ పై ఐటీ అధికారులు రెండో రోజు దాడులు నిర్వహిస్తున్నారు. కంపెనీ అధినేత విశ్వేశ్వరరెడ్డి ఇళ్లతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేపట్టారు. ఈ కంపెనీ సీఎం జగన్ కి సన్నిహిత కంపెనీ అని సమాచారం.

New Update
IT Raids: షిర్డీసాయి ఎలక్ట్రికల్స్​పై ఐటీ రైడ్స్ - రెండో రోజు కొనసాగుతున్నసోదాలు!

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ కి(AP CM Jagan) సన్నిహిత కంపెనీ అయినటువంటి కడప శివారులోని షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ (Shirdi Sai Electricals) పై వరుసగా రెండో రోజు ఐటీ దాడులు (IT Raids)  కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఆర్పీఎఫ్‌ బందోబస్తు మధ్య తెలంగాణ నుంచి వచ్చిన అధికారులు ఆ సంస్థకు సంబంధించిన కర్మాగారం వద్దకు చేరుకున్నారు.

కంపెనీతో పాటు సంస్థకు చెందిన కార్యాలయాలు, కంపెనీకి చెందిన వారి ఇళ్లలో సైతం ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్‌ లోని కంపెనీ కార్యాలయంలో సైతం ఒకేసారి తనిఖీలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే వైసీపీ ప్రభుత్వం ఈ కంపెనీకి సుమారు 52 ఎకరాలకోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని ఇచ్చింది.

కడపలోని కర్మాగారంలో విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లు, ట్రాన్స్‌ ఫార్మర్లు, ఇతర వస్తువులు తయారు చేస్తుంటారు. ఏపీ ప్రభుత్వం అండతో అతి తక్కువ కాలంలోనే సంస్థ ఆర్థికంగా బాగా లాభపడి ముందుకు సాగింది. దీంతో ఐటీ అధికారులు సోదాలు చేపట్టింది. తనిఖీల సమయంలో ఐటీ అధికారులు కంపెనీకి చెందిన అన్ని కాగితాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

కంపెనీ అధినేత అయిన విశ్వేశ్వరరెడ్డి ఇళ్లతో పాటు ఆయన బంధువులు ఇళ్లలో కూడా తనిఖీలు చేపట్టారు. కరుణాకరరెడ్డి చిన్న పిల్లల ఆసుపత్రిలోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

నగర శివార్లలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో 1994లో షిర్డీసాయి ఎలక్ట్రికల్ సంస్థ ఏర్పాటు చేసిన పులివెందులకు చెందిన విశ్వేశ్వరరెడ్డి. విశ్వేశ్వరరెడ్డి సీఎం జగన్ కు సన్నిహితులు. సంస్థలో ట్రాన్స్ఫార్మర్ల తయారీ నిర్వహిస్తున్న కంపెనీ. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాలకు ట్రాన్స్ఫార్మర్స్ ల సరఫరా చేస్తున్న కంపెనీ. ఇక్కడ నుంచి దేశ, విదేశాలకు విద్యుత్ పరికరాల ఎగుమతి చేస్తున్న కంపెనీ.

రాష్ట్రంలో విద్యుత్ పరికరాల ఏర్పాటుకు సంబంధించి ఏ ప్రాజెక్టు చేపట్టినా షిర్డీసాయి సంస్థకే కేటాయిస్తూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.
వేల కోట్ల ప్రాజెక్టులను కంపెనీకి అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం. ఇతర రాష్ట్రాల్లో షిర్డీసాయి సంస్థ కన్నా తక్కువ ధరకే విద్యుత్ మీటర్లు కొనుగోలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ధర కోట్ చేసిన ఆ సంస్థకే కేటాయింపులు చేసింది.

రాష్ట్రంలో మోటార్ల, స్మార్ట్ మీటర్లు ఏర్పాటు షిర్డీసాయి సంస్థకే కేటాయింపు.గతంలో జాతీయ స్థాయిలో ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు దక్కించుకున్న షిర్డీసాయి ఎలక్ట్రికల్ సంస్థ. గత ఏడాది డిసెంబర్ మాసంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న సంస్థ ఎండీ విశ్వేశ్వర రెడ్డి.

నెల్లూరు ఒంగోలు మధ్య రామాయపట్నం వద్ద 5147ఎకరాల భూమిని షిర్డీ సాయి ఎలక్ట్రికల్ సంస్థ కు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం.ఈ స్థలం గురించి వివాదాలు నడుస్తున్నప్పటికీ.. వివాదాలు పక్కన పెట్టి స్థలం కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం.

Also read: వైరలవుతున్న కేటీఆర్‌ ”నా అందమైన అర్థాంగికి..” పోస్ట్‌!

Advertisment
తాజా కథనాలు