IT Raids : మాజీ మంత్రి మల్లారెడ్డిపై మరోసారి ఐటీ పంజా!

మల్లారెడ్డి యజామాన్యం మేనేజ్‌ మెంట్ కోటా సీట్లను అమ్ముకుంటుందనే ఆరోపణలు రావడంతో అధికారులు ఐటీ అధికారులు సోదాలు చేపట్టినట్లు తెలుస్తుంది.లెక్కల్ని రికార్డుల్లో సైతం చూపించడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి.

New Update
IT Raids : మాజీ మంత్రి మల్లారెడ్డిపై మరోసారి ఐటీ పంజా!

IT Raids : మాజీ మంత్రి మల్లారెడ్డి(Malla Reddy)  పై మరోసారి ఐటీ(IT) అధికారులు తనిఖీలు నిర్వహించారు. మంగళవారం ఉదయం మేడ్చల్‌ మండలం మైసమ్మ గూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో(Malla Reddy Agricultural University)  ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. చెప్పపెట్టకుండా 40 మంది విద్యార్థులను డిటైన్ చేయడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం లాభపేక్ష కోసమే విద్యార్తులు జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.

దీంతో రంగంలోకి దిగిన ఐటీ అధికారులు సోదాలు మొదలు పెట్టారు. 10 మంది అధికారుల బృందం సోదాలు చేపట్టింది. ఇప్పటికే కాలేజీ యాజమాన్యాన్ని , సిబ్బందిని ప్రశ్నించిన ఐటీ అధికారులు. మల్లారెడ్డి యజామాన్యం మేనేజ్‌మెంట్ కోటా సీట్ల(Management Kota Seats) ను అమ్ముకుంటుందనే ఆరోపణలు రావడంతో అధికారులు ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తుంది.

లెక్కల్ని రికార్డుల్లో సైతం చూపించడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఐటీ అధికారుల సోదాల్లో ఆదాయానికి మించిన ఆస్తులు, బంధువుల పేరుతో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఆదాయపన్ను ఎగొట్టారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే అధికారులు మేనేజ్మెంట్‌ కోటా సీట్లను ఎంతకు అమ్ముకున్నారు ? అనే దాని మీద అధికారులు ప్రధానంగా ఆరా తీస్తున్నారు. ఏ విద్యార్థి ఎంత ఫీజు కట్టారు అనే దాని మీద విచారణ చేపట్టారు. కాలేజీ రికార్డులను స్వాధీనం చేసుకుని తీసుకెళ్లిన ఐటీ అధికారులు.

Also Read : ఆమె నటన అంటే పడి చచ్చిపోతా అంటున్న మాస్‌ మహారాజా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు