ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. ఇప్పటికే సీఎం జగన్ తన రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించారు. మరికొన్ని రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలో అమరావతిలోని సచివాలయంలో ఐటీశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఐటీ కమ్యూనికేషన్ విభాగంలో కంప్యూటర్‌లు, ల్యాప్‌ట్యాప్‌లు, ఇతర ఉపకరణలను అధికారులు తనిఖీ చేశారు. ఐటీ విభాగంలో కంప్యూటర్‌ల నుంచి డేటా తస్కరించేదుకు, వాటిని డిలేట్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఉద్యోగుల నుంచి పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు.
Also read: జగన్ ఓటమిపై షర్మిల సంచలన ట్వీట్