Social Media: భార్యల సోషల్ మీడియా అకౌంట్లపై భర్తల పెత్తనం.. హైకోర్టు కీలక తీర్పు! భార్యల సోషల్ మీడియా అకౌంట్లపై భర్తలు పెత్తనం చెలాయించడం క్రూరత్వంతో సమానమని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. ఓ విడాకుల కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం జీవిత భాగస్వామి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వాడకుండా చేయడాన్ని తప్పుపట్టింది. By srinivas 01 Jul 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Telangana High Court: భార్యల సోషల్ మీడియా అకౌంట్లపై భర్తలు పెత్తనం చెలాయించడం క్రూరత్వంతో సమానమని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. ఓ విడాకుల కేసులో జీవిత భాగస్వామిని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉండకుండా చేయడాన్ని తప్పుబట్టింది. ఈ మేరకు సోమవారం ఓ విడాకుల కేసును పరిశీలించిన హైకోర్టు.. వివాహ సందర్భంలోని క్రూరత్వం లక్షణాలను వివరించింది. భాగస్వామి ప్రతిష్టను, సామాజిక స్థితిని లేదా ఉద్యోగ అవకాశాలను దెబ్బతీసేది ఏదైనా చర్య క్రూరత్వమేనని పేర్కొంది. అంతేకాకుండా జీవిత భాగస్వామిని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉండకుండా చేయడం కూడా క్రూరత్వానికి సమానమని కోర్టు స్పష్టం చేసింది. ఆ వివాహా బంధాన్ని కొనసాగించడం అసాధ్యం.. హిందూ వివాహ చట్టం (హెచ్‌ఎంఏ) కింద విడాకులు కోరుతూ ఓ వ్యక్తి దాఖలు చేసిన అప్పీల్‌పై జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ ఎంజీ ప్రియదర్శినిలతో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం విచారణ జరిపింది. అనంతరం 2 నవంబర్ 2021 నాటి మహబూబ్‌నగర్‌లోని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వు నుంచి తీర్పు వెల్లడించింది. 1955లోని సెక్షన్ 13 (1) (i-a), (i-b) కింద విడాకుల పిటిషన్‌ను కొట్టివేసింది. అలాగే ఇష్టంలేని వ్యక్తుల వివాహా బంధాన్ని కొనసాగించడం సాధ్యం కాదని నొక్కి చెప్పింది. ప్రేమలేని వివాహంలో ఉండేందుకు ఇరువురిని బలవంతం చేయకూడదని సూచించింది. అప్పీలుదారు (భర్త) ప్రతివాది (భార్య) డిసెంబర్ 1, 2010న హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ఈ జంట డిసెంబర్ 4, 2010 నుంచి వైవాహిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో భార్య 2011న అత్తగారిళ్లు వదిలి భర్తకు దూరంగా ఉంటోంది. ఈ జంటకు ఒక బిడ్డ ఉంది. 2012లో భార్య ఫిర్యాదు చేయగా భర్త, అతని కుటుంబం 2012 ఆగస్టు 25న న ముందస్తు బెయిల్ పొందింది. అప్పీలుదారు మొదట 2012లో విడాకుల కోసం దాఖలు చేసినప్పటికీ అతను కేసును కొనసాగించలేదు. ప్రతివాది భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 498-A కింద ఆరోపణలతో సహా అప్పీలుదారుపై ఐదు క్రిమినల్ కేసులను దాఖలు చేశారు. మే 2015లో క్లుప్తంగా తిరిగి కలుసుకున్నప్పటికీ, ప్రతివాది అప్పీలుదారుపై క్రిమినల్ ఫిర్యాదులను దాఖలు చేయడం కొనసాగించారని కోర్డు వివరించింది. #telangana-high-court #wife-and-husband #divorce-case #social-media-acconts మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి