PT Usha : ఆ బాధ్యత వాళ్లదే... నిందించడం సరికాదు : పీటీ ఉష! ఒలింపిక్స్ లో బరువును ఎప్పటికప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత అథ్లెట్లదే అని ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష అన్నారు. ఈ బరువు విషయం గురించి మెడికల్ బృందాన్ని తప్పుపట్టడం సరికాదని ఆమె తెలిపారు. ఐఓఏ నియమించిన మెడికల్ ఆఫీసర్లకు ఎలాంటి బాధ్యత ఉండదని వివరించారు. By Bhavana 13 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Paris Olympics 2024 : కేవలం 100 గ్రాముల అధిక బరువు ఉండడం వల్ల రెజ్లర్ వినేశ్ ఫోగట్ (Vinesh Phogat) ..పారిస్ ఒలింపిక్స్ లో ఫైనల్లో అనర్హతకు గురైన విషయం యావత్ ప్రపంచానికి తెలిసిన విషయమే. అయితే ఆ అంశం పై భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష తాజాగా మాట్లాడారు. బరువును ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత కచ్చితంగా అథ్లెట్లదే అని ఆమె అన్నారు. ఈ విషయం గురించి మెడికల్ బృందాన్ని తప్పుపట్టడం సరికాదని వివరించారు. 50 కేజీల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్ మ్యాచ్ ఫైనల్‌కు ముందు కేవలం వంద గ్రాముల అధిక బరువు ఉన్న వినేశ్ ఫోగట్‌ను డిస్‌క్వాలిఫై చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ గోల్డ్ అందుకునే అవకాశాన్ని భారత్ (India) కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పట్ల నిందారోపణలు జరుగుతున్నాయి. పార్లమెంట్‌లోనూ ఈ అంశాన్ని లేవనెత్తారు. టీమ్ డాక్టర్ పర్దివాలా నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగినట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. వినేశ్ ఫోగట్ అనర్హత నేపథ్యంలో పీటీ ఉష (PT Usha) స్పందిస్తూ.. రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, బాక్సింగ్, జూడో లాంటి క్రీడల్లో బరువును మేనేజ్ చేసుకునే బాధ్యత అథ్లెట్ల, వాళ్ల కోచ్ వద్దే ఉంటుంది. ఐఓఏ నియమించిన మెడికల్ ఆఫీసర్లకు ఎలాంటి బాధ్యత ఉండదన్నారు. మెడికల్ టీమ్‌ను నిందించాలని అనుకుంటున్నవారు ముందుగా నిజాలను తెలుసుకుని మాట్లాడాలని ఆమె అన్నారు. పారిస్ క్రీడలకు వెళ్లిన ప్రతి భారతీయ అథ్లెట్‌కు సపోర్టు టీమ్ ఉందని, ఆ సపోర్ట్ టీమ్ వద్దే అథ్లెట్లు శిక్షణ పొందుతుంటారని, ఆ బృందాలు ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నట్లు పీటీ ఉష తెలిపారు. Also Read: ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ సేవలకు అంతరాయం..కారణం ఏంటంటే! #paris-olympics-2024 #india #vinesh-phogat #pt-usha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి