Meghana Foods : బెంగళూరు(Bengaluru) కు చెందిన మేఘనా ఫుడ్స్ గ్రూప్(Meghana Foods Group) మీద కర్ణాటక(Karnataka), గోవా(Goa) ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. కోరమంగళ, ఇందిరానగర్‌లోని కార్యాలయాలు సహా పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించారు. ఆదాయ పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసం ఉన్న కారణంగానే ఐటీ అధికారులు(IT Officers) దాడులు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ సంస్థ తాలూకా ఆర్ధిక వ్యవహారాల్లో చాలా తేడాలున్నాయని అందుకే దర్యాప్తు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. మేఘనా ఫుడ్స్‌తో పాటూ ఇతర సంస్థలను, ఆ గ్రూప్‌కు చెందిన పలు ప్రదేశాల్లోనూ పోదాలు నిర్వహిస్తున్నారు.
కర్ణాటక, గోవాకు చెందిన ఐటీ అధికారులు మేఘనా ఫుడ్స్ గ్రూప్ మీద ఈ రోజు తెల్లవారుఝామున 5 గంటల నుంచి దాడులు చేస్తున్నారు. ఆదాయపన్నుల్లో చాలా ఎక్కువగా వ్యత్యాసాలున్నాయని వారు చెబుతున్నారు. మొత్తం పదిచోట్ల ఏకకాంలో దాడులు నిర్వహిస్తున్నారు.
Also Read : IT Raids : మాజీ మంత్రి మల్లారెడ్డిపై మరోసారి ఐటీ పంజా!