ISRO Scientist Salary: ఇస్రో సైంటిస్ట్ శాలరీ ఎంత? ప్రస్తుతం జాబ్‌ ఓపెనింగ్స్‌ ఎన్ని ఉన్నాయి?

చంద్రయాన్‌-3, ఆదిత్య ఎల్‌-1 మిషన్‌ విజయాల తర్వాత ఎక్కడ చూసినా ఇస్రో సైంటిస్టుల గురించే చర్చ జరుగుతోంది. ఇస్రో సైంటిస్టుల శాలరీ గురించి గూగుల్‌లో సేర్చ్‌ చేస్తున్నారు నెటిజన్లు. రిపోర్ట్స్ ప్రకారం ఇస్రో సైంటిస్ట్ ఇంజనీర్ (ఎస్సీ) ప్రారంభ వేతనం రూ.84,360. ఇక బెనిఫిట్స్‌ కూడా అదనంగా ఉంటాయి. ప్రస్తుతం 65 సైంటిస్టు, ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ISRO Scientist Salary: ఇస్రో సైంటిస్ట్ శాలరీ ఎంత? ప్రస్తుతం జాబ్‌ ఓపెనింగ్స్‌ ఎన్ని ఉన్నాయి?
New Update

ISRO Scientist Salary: చంద్రయాన్-3 (Chandrayaan-3)విజయవంతంగా ల్యాండ్ కావడం, తొలి సోలార్ మిషన్ ఆదిత్య ఎల్-1 (Aditya-L1) ప్రయోగంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఈ విజయాల వెనుక దేశ అంతరిక్ష ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేసిన సైంటిస్టుల గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. మరి వారి జీతం ఎంతో తెలుసా?

జీతం:
ఇస్రో(ISRO) సైంటిస్ట్ ఇంజనీర్ (ఎస్సీ) ప్రారంభ వేతనం(Starting salary) రూ.84,360. ఇందులో ట్రావెల్ బెనిఫిట్స్, హౌసింగ్ రెంట్ బెనిఫిట్స్ (హెచ్ఆర్ఏ), డియర్నెస్ బెనిఫిట్స్ లాంటి పలు రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. తగ్గింపుల తర్వాత నికర వేతనం(In-Hand)సుమారు రూ.72,360గా ఉంది. 7th పే కమిషన్‌ ప్రకారం ఈ శాలరీ ఉంది. ఇస్రో సిబ్బందితో సహా భారతదేశంలో, 7వ వేతన సంఘం కొత్త వేతన వ్యవస్థను అమలు చేసింది. అయితే ఈ కమిషన్ "గ్రేడ్ పే" ఆలోచన స్థానంలో "పే లెవల్" విధానాన్ని ప్రవేశపెట్టింది. గ్రేడ్ పేకు బదులుగా, ప్రతి పొజిషన్ కు ఒక నిర్దిష్ట వేతన స్థాయి ఉంటుంది.

ఇస్రో ఖాళీలు:
ప్రస్తుతం ఇస్రో పలు పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. తన అధికారిక వెబ్సైట్‌ isro.gov.in లో సైంటిస్టు, ఇంజినీర్ పోస్టులకు 65 ఖాళీలు ఉన్నట్లు ఇస్రో ప్రకటించింది.

చంద్రయాన్-3 ల్యాండింగ్, ఆదిత్య-ఎల్1 ప్రయోగం:
మరోవైపు చంద్రయాన్‌-3 సక్సెస్.. ఆదిత్య ఎల్‌-1 దూకుడుతో ఇస్రో రేంజ్‌ ఏంటో ప్రపంచానికి తెలిసి వచ్చించి. ఇక చంద్రయాన్-3కి చెందిన ప్రజ్ఞాన్ రోవర్ స్లీప్‌ మోడ్‌లోకి జారుకున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది. సెప్టెంబర్ 22న రోవర్‌ను మేల్కొల్పాలని స్పేస్ ఏజెన్సీ భావిస్తోంది. ప్రజ్ఞాన్ రోవర్‌లో రెండు పేలోడ్స్ ఉన్నాయి. ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ లేజర్ ప్రేరిత బ్రేక్డౌన్ స్పెక్ట్రోస్కోప్. ల్యాండర్ ద్వారా భూమికి డేటాను చేరవేసే పేలోడ్లను ఆఫ్ చేసినట్లు ఇస్రో తెలిపింది. ప్రస్తుతం బ్యాటరీ పూర్తిగా చార్జ్ అయింది.సెప్టెంబర్ 22 సూర్యోదయానికి ఈ సోలార్ ప్యానెల్ కాంతిని అందుకుంటుంది. రిసీవర్ ఆన్‌లో ఉంటుంది.

ALSO READ: షార్‌లో విషాదం.. వాయిస్ ఆఫ్ ఇస్రో, శాస్త్రవేత్త వలర్మతి ఇక లేరు!

ALSO READ: ఇస్రో సైంటిస్టుల ఎనర్జీ సీక్రేట్‌ మసాలా దోస.. ఇది చదివితే మీరు కూడా ఆ టైమ్‌లో తింటారు!

#chandrayaan-3 #isro #isro-jobs #isro-salary #isro-scientist-salary
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe