Ayodhya Ram Mandir: ఇస్రో అయోధ్య శాటిలైట్ ఫొటో ఎంత అద్భుతంగా ఉందో..!! దేశం రామనామస్మరణతో మారుమోగుతోంది. ఈ వేళ అయోద్య నగరానికి సంబంధించి ఓ అపూర్వ చిత్రాన్ని ఇస్రో షేర్ చేసింది. ఇస్రోకు చెందిన ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అంతరిక్షం నుంచి రామ మందిరం ఎలా ఉందో తెలిపే అయోధ్య ఫొటో క్లిక్ అనిపించింది. By Bhoomi 21 Jan 2024 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి Ayodhya Ram Mandir: దేశమే కాదు..ప్రపంచం కూడా రామమయం అయ్యింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ముహుర్తం దగ్గర పడింది. అయోధ్యలో ప్రాణప్రతిష్ట కోసం ఈనెల 16వ తేదీ నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు షురూ అయ్యాయి. ఈ వేడుకను పురస్కరించుకుని దేశంలోని ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇస్రో కు చెందిన ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్(Indian Remote Sensing Satellite) అంతరిక్షం నుంచి రామమందిరం ఎలా ఉంటుందో తెలిపే ఫొటోను షేర్ చేసింది. ఇస్రో(isro) షేర్ చేసిన ఫొటోలో రామ మందిరం, అయోధ్య రైల్వే స్టేషన్, సరయూ నదితోపాటు మొత్తం నగరం ఏరియల్ రివ్యూ కనిపిస్తుంది. రేపు జరిగే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు(Janmabhoomi Tirtha Kshetra Trust) ఏర్పాట్లన్నీ చేసింది. అయోధ్య నగరం మొత్తం ఎంతో అందంగా ముస్తాబయ్యింది. ఈ వేడుకకు హాజరుకావాలని ట్రస్టు దేశంతో పాటు విదేశాల్లోని ప్రముఖులకు అహ్వానాలు కూడా పంపింది. ఈ కార్యక్రమానికి మోదీ తోపాటు పలువురు సినీప్రముఖులు, వ్యాపారులు, క్రికెటర్లు హాజరుకానున్నారు. अंतरिक्ष से #राममंदिर 🛕 @ISRO ने अयोध्या के राम मंदिर की तस्वीरें खींचीं। दशरथ महल और सरयू नदी इन स्नैपशॉट में केंद्र बिंदु हैं। विशेष रूप से, हाल ही में पुनर्निर्मित अयोध्या रेलवे स्टेशन विस्तृत छवियों में प्रमुखता से दिखाई देता है। आइए देखें...#Ayodhya#ShriRamJanmbhoomi pic.twitter.com/di9jRDDkww — MyGov Hindi (@MyGovHindi) January 21, 2024 ఇది కూడా చదవండి: ఖుష్భు అత్తతో పీఎం మోదీ భేటీ..కల నిజమైందని సంతోషం..!! వీఐపీలు,వీవీఐపీలు అయోధ్యకు రానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అయోధ్య నగరాన్ని యూపీ పోలీసులతో పాటు కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. రామమందిరం నుంచి 6కిలోమీటర్ల దూరంలోనే బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాలు నిలిపివేస్తున్నారు. స్థానికులు, పాసులు ఉన్నవారు మాత్రమే లోపలికి వెళ్లవచ్చు. అయోధ్య రామమందిరంతోపాటు నగరమంతా పోలీస్ బందోబస్తులో ఉంది. #ayodhya-ram-mandir #isro #space #ayodhya-temple #ayodhya-ram-mandir-pran-pratishtha #isro-satellite-photo-of-ayodhya-temple మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి