ISRO : విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్‌ఎల్వీ-డీ3!

ఇస్రో చేపట్టిన ఎస్‌ఎస్ఎల్‌ వీ - డీ 3 ప్రయోగం విజయవంతం అయ్యింది.శ్రీహరికోటలోని షార్‌ నుంచి ఈ మిషన్‌ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా 175 కిలోల ఈవోఎస్‌ 08 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

ISRO : విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్‌ఎల్వీ-డీ3!
New Update

ISRO -  SSLV-D3 : ఇస్రో (ISRO) చేపట్టిన ఎస్‌ఎస్ఎల్‌ వీ - డీ 3 ప్రయోగం విజయవంతం అయ్యింది. తిరుపతి జిల్లా (Tirupati District) శ్రీహరికోటలోని షార్‌ నుంచి ఈ మిషన్‌ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా 175 కిలోల ఈవోఎస్‌ 08 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. మొత్తం 17 నిమిషాల పాటు ఈ ప్రయోగం కొనసాగింది. విపత్తు నిర్వహణలో సమాచారం ఇచ్చేందుకు ఈ ఉపగ్రహం సహకరిస్తుంది.

పర్యావరణం, ప్రకృతి విపత్తులు, అగ్ని పర్వతాలపై ఇది పర్యవేక్షించనుంది. ఇస్రోకు చెందిన యూఆర్‌ రావు శాటిలైట్ సెంటర్ (UR Rao Satellite Centre) లో ఈవోఎస్‌ను అభివృద్ది చేశారు. ఇందులో ఉండే ఎలక్ట్రో ఆప్టికల్‌ ఇన్‌ ఫ్రారెడ్‌ పేలోడ్ మిడ్‌ -వేవ్‌, లాంగ్‌ వేవ్‌ ఇన్‌ ఫ్రా రెడ్‌ లో చిత్రాలను తీస్తుంది.

విపత్తు నిర్వహణలో ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో పేర్కొంది.

Also Read: నాలుగు రాష్ట్రాల ఎన్నికల తేదీ నేడు ప్రకటన!

#tirupati #sriharikota #sslv-d3 #isro
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి