IIT Madras: 60ఏళ్ల వయసులో పీహెచ్‌డీ పట్టా అందుకున్న ఇస్రో ఛైర్మన్‌!

ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ 60ఏళ్ల వయసులో పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. ఐఐటీ మద్రాస్‌లో జరిగిన 61వ స్నాతకోత్సవంలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ఆయన మద్రాస్‌ ఐఐటీ నుంచి డాక్టరేట్‌ను పొందారు.

New Update
IIT Madras: 60ఏళ్ల వయసులో పీహెచ్‌డీ పట్టా అందుకున్న ఇస్రో ఛైర్మన్‌!

ISRO Chairman: ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ 60ఏళ్ల వయసులో పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. ఐఐటీ మద్రాస్‌లో జరిగిన 61వ స్నాతకోత్సవంలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ఆయన మద్రాస్‌ ఐఐటీ నుంచి డాక్టరేట్‌ను పొందారు. ఈ మేరకు మద్రాస్‌ ఐఐటీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థ నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకోవడం చాలా గర్వంగా ఉందన్నారు సోమనాథ్.

ఐఐటీ ఎంట్రెన్స్ టెస్ట్ రాసే ధైర్యం చేయలేక..
ఇక ఒక పల్లెటూరిలో పుట్టి పెరిగిన తాను టాపర్‌ అయినప్పటికీ ఐఐటీ ఎంట్రెన్స్ టెస్ట్ రాసే ధైర్యం చేయలేదన్నారు. గ్రాడ్యుయేషన్‌ చేయాలనే కోరిక మాత్ర ఉండేదని, ఆ కల ఇప్పుడు నెరవేరిందని చెప్పారు. గతంలో ఐఐటీ- బెంగళూరు నుంచి మాస్టర్స్‌ డిగ్రీ అందుకున్నా. విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడే నా జీవితంలో సాధించాల్సిన విషయాలపై శ్రద్ధ పెట్టాలని, వాటిని నెరవేర్చుకునేందుకు నిరంతరం ప్రయత్నించాలని నిర్ణయించుకున్నానని సోమనాథ్‌ చెప్పారు. కేరళలోని అళప్పుళ జిల్లాలో జన్మించిన సోమనాథ్‌.. ప్రస్తుతం ఇస్రో ఛైర్మన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. చంద్రయాన్-3 ప్రయోగం ఆయన సారథ్యంలోనే జరగడం విశేషం.



Advertisment
తాజా కథనాలు