Isreal: గాజా సిటీసెంటర్..పార్లమెంట్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ హమాస్ స్వాధీనం చేసుకున్న గాజాలో ఇజ్రాయెల్ సైన్యం పట్టు సాధిస్తోంది. ఇప్పటికే గాజాలోని పార్లమెంట్, గాజా సిటీ సెంటర్ ను స్వాధీనం చేసుకున్న సైనికులు తాజాగా అల్-షిఫా ఆసుపత్రిలోకి చొచ్చుకుపోయాయి. అక్కడ ఇప్పుడు హమాస్ ప్రతిఘటన స్వల్పంగానే ఉందని చెబుతున్నారు. By KVD Varma 15 Nov 2023 in ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి Isreal: ఇజ్రాయెల్ సైన్యం గాజాలో పెద్ద ముందడుగు వేసింది. ఇప్పటివరకూ హమాస్ ఆధీనంలో ఉన్న కీలక ప్రాంతాలను కైవసం చేసుకుంది. ఇజ్రాయెల్ దళాలు బుధవారం తెల్లవారుజామున గాజాలోని అల్-షిఫా ఆసుపత్రిలోకి ప్రవేశించాయి. ఆసుపత్రి లోపల కొన్ని చోట్ల సైనికులు - హమాస్ ఫైటర్ల మధ్య పోరు కొనసాగుతోంది. లొంగిపోవాలని ఇజ్రాయెల్ హమాస్ సంస్థను కోరింది. ఐక్యరాజ్య సమితి(UNO) లెక్కల ప్రకారం, రోగులు- సిబ్బందితో సహా దాదాపు 2300 మంది ఆసుపత్రిలో ఉన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) మేము అల్-షిఫా హాస్పిటల్‌లో ఎంచుకున్న లక్ష్యాలతో హమాస్‌పై ఆపరేషన్ ప్రారంభించాము అని చెప్పింది. అయితే, ఎంత మంది సైనికులు ఆసుపత్రిలోకి ప్రవేశించారనే సమాచారం వెల్లడి కాలేదు. మరోవైపు, ఉత్తర గాజా స్ట్రిప్‌పై సైన్యం పూర్తి నియంత్రణను కలిగి ఉందని ఇజ్రాయెల్(Isreal)రక్షణ మంత్రి మంగళవారం చెప్పారు. అయితే, హమాస్ యోధులు భూగర్భ సొరంగంలో దాక్కున్నారు. ఆ సొరంగాలను గుర్తించామని ఆయన అన్నారు. ఇజ్రాయెల్ గాజా సిటీ సెంటర్- పార్లమెంటును కూడా స్వాధీనం చేసుకుంది. దాదాపుగా హమాస్ ఆధీనంలోని కీలక ప్రాంతాలన్నీ ఇజ్రాయెల్ దళాల చేతికి వచ్చాయని వెల్లడించారు. అమెరికాకు దూరమవుతున్న అరబ్ దేశాలు.. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది . 'టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్' నివేదిక ప్రకారం - ఇజ్రాయెల్ ప్రధాని యుద్ధం తర్వాత కూడా గాజాపై నియంత్రణ సాధించాలనుకుంటున్నారు. దీనివల్ల అరబ్ దేశాలు అమెరికాకు దూరమవుతున్నాయి. Also Read: ఆస్పత్రి కింద హమాస్ బంకర్లు..గుర్తించిన ఐడీఎఫ్ వాస్తవానికి, యుద్ధం తర్వాత గాజా పరిపాలనను పాలస్తీనా అథారిటీ (PA) స్వాధీనం చేసుకోవాలని అమెరికా కోరుకుంటుంది. అయితే నెతన్యాహు ఇక్కడ పూర్తి ఆక్రమణను కోరుకోవడమే కాకుండా, పరిపాలనను తన చేతుల్లోకి తీసుకోవాలని కూడా కోరుకుంటున్నారు. అమెరికా డిమాండ్లను కూడా అంగీకరించేందుకు నెతన్యాహు సిద్ధంగా లేరని అరబ్ దేశాలు భావిస్తున్నాయి. అమెరికాకు సమస్యలు.. రిపోర్ట్స్ ప్రకారం, అమెరికా చొరవతో, కొన్ని అరబ్ దేశాలు యుద్ధం తర్వాత గాజా పరిపాలనను వెస్ట్ బ్యాంక్‌లో ప్రభుత్వాన్ని నడుపుతున్న PA కి అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు, హమాస్ నిర్మూలన తర్వాత కూడా గాజాపై నియంత్రణను వదులుకోనని నెతన్యాహు రెండుసార్లు చెప్పారు. ఎందుకంటే తనకు మరే ఇతర దేశం లేదా సంస్థపై నమ్మకం లేదని ఆయన అంటున్నారు. యుద్ధం తరువాత, గాజా పరిపాలనను PA స్వాధీనం చేసుకుంటుందని.. అంతర్జాతీయ సంస్థ దానిపై నిఘా ఉంచుతుందని బహిరంగ వేదిక నుంచి నెతన్యాహు ప్రకటించాలని.. దీనికి అమెరికా ఆయనను సిద్ధం చేయాలనీ అరబ్ దేశాలు కోరుతున్నాయి. దీన్ని నెతన్యాహు ఖండిస్తున్నారు. Watch this interesting Video: #isreal #isreal-vs-palestinia మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి