MODI : ప్రధాని మోదీకి కృతజ్జతలు తెలిపిన ఇజ్రాయెల్‌ మహిళ!

హమాస్ దాడి నుంచి తన ప్రాణాలను కాపాడినందుకు ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ మహిళ ధన్యవాదాలు తెలిపారు.అక్టోబర్ 7, 2023న   హమాస్ దాడి చేసినప్పుడు భారత్ సహాయం చేయటం వల్ల తాము ప్రాణాలతో ఉన్నామని ఆ మహిళ తెలిపారు. ఇజ్రాయెల్ కు నిజమైన స్నేహితులు భారత్ అని ఆమె కొనియాడారు.

MODI : ప్రధాని మోదీకి కృతజ్జతలు తెలిపిన ఇజ్రాయెల్‌ మహిళ!
New Update

Wishes To PM Modi : అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై  హమాస్(Israel- Hamas) దాడి చేసినప్పుడు అక్కడి నుంచి బయటపడిన ఇజ్రాయెల్ మహిళ ప్రధాని మోదీ(PM Modi) కి కృతజ్జతలు తెలిపారు. తమ దేశం పట్ల భారతదేశం(India)  నిరంతర మద్దతును ఇస్తుందని  ఆమె భారత్ ను  ప్రశంసించింది. దీంతో పాటు ఆ మహిళ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా భారతదేశం ఇజ్రాయెల్ కు నిజమైన స్నేహితులని ఆమె అభివర్ణించారు.

సరిహద్దు విషయంలో జరిగిన యుద్ధ మారణకాండ ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా ఏప్రిల్ 7న మోరన్ అనే మహిళ ఈ వ్యాఖ్య చేసింది. అక్టోబర్ 7, 2023 న జరిగిన ఊచకోతలో, దక్షిణ ఇజ్రాయెల్‌లో హమాస్ 1,200 మందిని చంపిందని, ఇది గాజాలో హమాస్‌తో దేశం  యుద్ధాన్ని ప్రారంభించింది. ఇజ్రాయెల్ సైన్యం, యుద్ధంలో ఇప్పటివరకు 600 మంది సైనికులు మరణించారు.

యుద్ధంలో 33,207 మంది పాలస్తీనియన్లు మరణించారు.

పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటన చేసింది.  గాజాలో ఆరు నెలల యుద్ధంలో కనీసం 33,207 మంది పాలస్తీనియన్లు మరణించారని వెల్లడించింది. హమాస్ ఆధీనంలో ఉన్న ఎన్‌క్లేవ్‌లోని 2.3 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులుగా మిగిలిపోయారని చాలా మంది కరువు ప్రమాదంలో ఉన్నారని తెలిపింది. వార్తా సంస్థ ANIతో మాట్లాడుతూ, సంక్షోభం నేపథ్యంలో భారతదేశం  నిరంతర మద్దతును ఇవ్వటంపై మోరన్ కృతజ్ఞతలు తెలిపారు.

 'ప్రధాని మోదీకి ధన్యవాదాలు.. ఇజ్రాయెల్‌కు భారతదేశం నిజమైన మిత్రదేశమని మాకు తెలుసు. మోరన్ భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయడమే కాకుండా, భారతదేశ ప్రజలను 'మా మంచి స్నేహితులు' అని కూడా పిలిచారు. ఎప్పటికీ మనకు మంచి స్నేహితులుగా ఉంటూనే ఉన్న భారతీయ ప్రజలకు ధన్యవాదాలు అని ఆమె తెలిపారు.
#israel #hamas #pm-modi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe