Israel-Gaza: ఖాన్‌ యునిస్‌ నగరంలో ఇజ్రాయెల్‌ దాడులు.. 70 మంది మృతి

సోమవారం పశ్చిమ గాజాలోని ఖాన్‌ యునిస్‌ నగరంలో ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో 70 మంది మృతి చెందారు. మరో 200 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఈ విషయాన్ని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఖాన్‌ యునిస్‌లో 30 ఉగ్రవాద మౌళిక సదుపాయాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ తెలిపింది.

Israel-Gaza: ఖాన్‌ యునిస్‌ నగరంలో ఇజ్రాయెల్‌ దాడులు.. 70 మంది మృతి
New Update
గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం పశ్చిమ గాజాలోని ఖాన్‌ యునిస్‌ నగరంలో జరిపిన దాడుల్లో 70 మంది మృతి చెందారు. మరో 200 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఈ విషయాన్ని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ ప్రాంతంలో రాకెట్‌ దాడులను అడ్డుకునేందుకు బలవంతంగా చర్యలకు దిగుతామని ఇజ్రాయెల్ హెచ్చరించిన అనంతరం ఈ కాల్పులు జరిగాయి. తాత్కాలక తరలింపు ఆదేశం అనంతరం.. పశ్చిమ ప్రాంతాల్లో ఇప్పటికే వేలాది మంది పాలస్తీనియన్లు వేరే ప్రాంతాలకు తరలివెళ్లారు.
హమాస్‌ తీవ్రవాదులే తమ లక్ష్యమని తెలిపిన ఇజ్రాయెల్‌ మిలటరీ.. ఖాన్‌ యునిస్‌లో 30 ఉగ్రవాద మౌళిక సదుపాయాలున్నాయని.. వాటిని లక్ష్యంగా చేసుకొనే దాడులు చేశామంటూ ప్రకటించింది. ఇదిలాఉండగా ఇటీవల అల్‌-మవాసీలో జరిపిన దాడుల్లో 92 మంది మృతి చెందారు. దీనిపై స్పందించిన ఇజ్రాయెల్‌ తాము హమాస్‌ కమాండర్‌ను టార్గెట్ చేశామంటూ పేర్కొంది. అలాగే గాజాలో 12 మంది మృతి చెందగా.. జబాలియా శరణార్థుల శిబిరంలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు .
ఇజ్రాయెల్‌ సైనిక తిరుగుబాటులో ఇప్పటివరకు గాజాలో 39 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఎక్కువగా సాధారణ పౌరులే ఉన్నట్లు గాజా ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజామిన్‌ నెతన్యాహు యూఎస్‌ కాంగ్రెస్‌లో ప్రసంగించేందుకు సోమవారం వాషింగ్టన్‌కు చేరుకున్నారు.
అలాగే ఆయన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను కూడా కలవనున్నారు. ఉపాధ్యాక్షురాలు, డెమెక్రాటిక్‌ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌ సైతం ఈ వారంలో నేతన్యాహును కలవనున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్‌లో ప్రభుత్వ వ్యతిరేక వాదులు, బందీల కుటుంబాలు చేస్తున్న నిరసనలు నేతన్యాహుపై ఒత్తిడిని తీసుకొస్తున్నాయి. గత వారం రోజులుగా ఇజ్రాయెల్‌పై కూడా దాడులు జరుగుతున్నాయి. ఇటీవల టెల్‌ అవివ్‌పై యెమెన్‌కు చెందిన హౌతీలు డ్రోన్‌ దాడులకు పాల్పడ్డారు. ఇది జరగిన అనంతరం ఇజ్రాయెల్‌ మొదటిసారిగా యెమిన్‌పై కాల్పులకు పాల్పడింది.

#telugu-news #khan-yunis #israel
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe