Israel-Hamas War: హమాస్ దాడుల్లో కేరళ మహిళల తెగువ.. వీడియో వైరల్

ఇజ్రాయెల్, పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ల మధ్య నెలకొన్న భీకర యుద్ధ వాతావరణం ఇంకా చల్లారలేదు. ఇరు దేశాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తాజాగా కేరళ మహిళల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన సబిత, మీరా మోహన్ అనే ఇద్దరు మహిళలు ఇజ్రాయెల్‌లో కేర్ గీవర్లుగా పనిచేస్తున్నారు.

Israel-Hamas War: హమాస్ దాడుల్లో కేరళ మహిళల తెగువ.. వీడియో వైరల్
New Update
Kerala woman in Israel: ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకు దాదాపు 3 వేల మందికి పైగా ఇజ్రాయెల్, పాలస్తీనీయన్ పౌరులు చనిపోయారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని.. ఇరు దేశాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తాజాగా కేరళ మహిళల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన సబిత, మీరా మోహన్ అనే ఇద్దరు మహిళలు ఇజ్రాయెల్‌లో కేర్ గీవర్లుగా పనిచేస్తున్నారు. ఇటీవల గాజా సరిహద్దుల్లో నీర్ ఓజ్ అనే కిబుట్జ్‌లోకి హమాస్ మిలిటెంట్లు చొరబడి దాడులకు పాల్పడినప్పుడు వారు అక్కడే పనిలో ఉన్నాయి. ఆ సమయంలోనే వారిద్దరు ఓ వృద్ధురాలిని హమాస్ దాడుల నుంచి రక్షించగలిగారు. వారి ధైర్యాన్ని కొనియాడుతూ భారత్‌లోని ఇజ్రాయెల్‌ ఎంబసీ తాజాగా ఎక్స్‌లో ఓ వీడియోను పోస్టు చేసింది. ఆరోజు ఎదుర్కొన్న భీకర పరిస్థితులను సబిత ఆ వీడియోల తెలియజేశారు.

Also Read: ఆసుపత్రిపై దాడి మిలిటెంట్ల పనే- ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు

ఈ సరిహద్దు ప్రాంతంలో నేను మూడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఏఎల్‌ఎస్ వ్యాధితో బాధపడుతున్న రహేల్‌ అనే వృద్ధురాలికి నేను, మీరా మోహన్‌ కేర్‌గివర్లుగా ఉంటూ పనిచేస్తున్నాం. అక్టోబరు 7న నేను నైట్‌ డ్యూటీలో ఉన్నాను. ఉదయం 6.30 AM గంటలకు వెళ్లిపోవాల్సింది. కానీ అదే సమయంలో మాకు సైరన్లు వినిపించాయి. వెంటనే రహేల్‌ను తీసుకుని మేం సేఫ్టీ గదుల్లోకి పరిగెత్తాము. కానీ ఎంతవరకూ కూడా సైరన్ల మోత ఆగడం లేదు. దీంతో బయట ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఆ సమయంలోనే రహేల్‌ కుమార్తె మాకు ఫోన్‌ చేసి.. ‘పరిస్థితి చేయి దాటిపోయిందని.. ముందు, వెనుక డోర్లు లాక్‌ చేసుకోండని చెప్పారు. దీంతో మేం వెంటనే డోర్లు లాక్‌ చేసుకున్నాం. ఉదయం 7.30 AM గంటల సమయంలో ఉగ్రవాదులు మా ఇంట్లోకి చొరబడ్డారు. మేము ఉన్న గది తలుపులు తెరిచేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ మాకు చేయాలో అర్థం కాలేదు. దీంతో మళ్లీ రహేల్‌ కుమార్తెకు ఫోన్‌ చేశాం. డోర్‌ను గట్టిగా పట్టుకోండని.. వదిలిపెట్టొద్దని రహేల్ కుమార్తె చెప్పారు. మేం అలాగే చేశాం. పట్టు పోకుండా ఉండడనానికి మా చెప్పులను కూడా తీసేశాం. అటు బయటి నుంచి ఉగ్రవాదులు మా గది తలుపు బద్దలుకొట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఏకంగా తుపాకీతో కాల్పులు కూడా జరిపారు.

మేము నాలుగున్నర గంటల పాటుగా అలా ఆ తలుపును గట్టిగా పట్టుకునే ఉన్నాం. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మళ్లీ కాల్పుల మోత మాకు వినిపించింది. అప్పుడు ఆ ఇంటి యజమాని అయిన షెములిక్‌ వచ్చి.. ఇజ్రాయెల్‌ సైన్యం వచ్చిందని చెప్పారు. ఆయన బయటికెళ్లి చూసేసరికి సరికి అంతా ధ్వంసమై కన్పించింది. మా ఇంట్లోకి ఉగ్రవాదులు వచ్చి అన్ని దోచుకెళ్లారు. మీరా పాస్‌పోర్ట్‌, నా ఎమర్జెన్సీ బ్యాగ్‌ను కూడా తీసుకెళ్లారు. సాధారణంగా సరిహద్దుల్లో ఉండే మాకు ఎప్పుడైనా క్షిపణులు పడినప్పుడు సేఫ్టీ గదుల్లోకి వెళ్లి తలదాచుకోవడం.. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక బయటకు రావడం అలవాటే. అప్పుడు మా ఎమర్జెన్సీ బ్యాగులని తీసుకుని వెళ్తాం. అందులో మాకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఉంటాయి. కానీ, ఇలాంటి ఉగ్రదాడిని మేం అస్సలు ఊహించలేదు. అంతా క్షణాల్లో జరిగిపోయిందంటూ.. సబిత ఆ వీడియోలో ఆ రోజు జరిగిన ఘటనను గుర్తుచేసుకున్నారు. అయితే ఈ వీడియోతో సహా హమాస్‌ తూటాలు దిగిన గది తలుపు ఫొటోను కూడా భారత్‌లోని ఇజ్రాయెల్‌ ఎంబసీ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. భారత వీరవనితలు వీరు. హమాస్‌ దాడి నుంచి ఇజ్రాయెల్‌ పౌరులను కాపాడారు అంటూ ప్రశంసించింది.

#israel-war #hamas-israel-news #isreal-vs-palestinia #kerala-woman-in-israel
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe