ఇజ్రాయెల్(Israel)-గాజా(Gaza) యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. ఇరు వర్గాలు ఎక్కడా కూడా వెనక్కి తగ్గడంలేదు. ఒకరిపై ఒకరు బాంబులు విసురుకుంటున్నారు. ఈ భీకర దాడుల్లో అమాయకులు సైతం ప్రాణాలు విడిస్తున్నారు. ఇప్పటివరకు ఇరువైపుల నుంచి 240మంది చనిపోయినట్టు సమాచారం. ఇది కూడా అధికారిక లెక్క మాత్రమే. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇజ్రాయెల్‌పై హమాస్ ఆకస్మిక దాడిలో 40 మంది మరణించగా.. మరో 779 మంది గాయపడ్డారని ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అటు గాజా స్ట్రిప్‌లో 200 మంది మరణించారని తెలుస్తోంది.
పెరుగుతున్న మృతుల సంఖ్య:
హమాస్ మిలిటెంట్లు 2,000 క్షిపణులను ప్రయోగించి దేశంలోని దక్షిణ ప్రాంతాల్లోకి చొరబడ్డారని ఇజ్రాయెల్ చెబుతోంది. ఇజ్రాయెల్‌లో గత కొన్నేళ్లలో జరిగిన అత్యంత ఘోరమైన దాడి ఇదేనని తెలిపింది. అటు హమాస్ ఉగ్రవాద దాడులను నాటో ఖండించింది. ఇజ్రాయెల్‌పై దాడి తర్వాత హమాస్ నిజస్వరూపం బయటపడిందని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ అన్నారు. ఇక మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్‌లో హింసాత్మక ఘటనలలో అమెరికా అప్రమత్తమైంది. గత సెప్టెంబర్‌లో జరిగిన సమావేశంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతయాన్హుతో చివరిసారిగా మాట్లాడారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఇక అమెరికా ఎప్పుడూ కూడా ఇజ్రాయెల్ సపోర్టర్‌నన్న విషయం తెలిసిందే. జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న అమెరికా.. బెంజమిన్‌తో మాట్లాడేందుకు రెడీ ఐనట్టుగా తెలుస్తోంది. బెంజమిన్‌తో బైడెన్ మాట్లాడనున్నారని సమాచారం.
పెరుగుతున్న ఉద్రిక్తతలు:
సరిహద్దు సమీపంలో 50 మంది ఇజ్రాయెలీలను హమాస్ బందీలను చేసిందని సమాచారం. నిమిషం నిమిషానికి ఉద్రిక్తతలు పెరుగుతున్నట్టు క్లియర్‌కట్‌గా తెలుస్తోంది. అటు ప్రపంచదేశాలు ఈ దాడులను ఖండిస్తున్నాయి. ఇజ్రాయెల్‌కు భారత్ సంఘీభావం తెలిపింది. భద్రతా కారణాలతో ఢిల్లీ-టెల్ అవీవ్, రిటర్న్ ఫ్లైట్‌ను రద్దు చేసింది ఎయిరిండియా. ఇక ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ పౌరులపై జరిగిన ఉగ్రదాడిని జార్జియా ప్రధాని ఇరాక్లీ గరిబష్విలి ఖండించారు. అటు సంయమనం పాటించాలని పాలస్తీనియన్లు, ఇజ్రాయెలీలకు ఈజిప్టు విజ్ఞప్తి చేసింది. ఇక ఈ ఉద్రిక్త పరిస్థితులు ఎక్కడి వరకు వెళ్తాయోనన్న భయాలు ప్రజల్లో నెలకొన్నాయి. ఇరు దేశాలను శాంతపరాచాల్సిన దేశాలు కూడా ఏదో ఒక సైడ్ తీసుకోని మాట్లాడుతుండడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ALSO READ: ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య యుధ్ధమేఘాలు