Israel-Hamas war: యుద్ధ విరమణకు వేళాయే.. నేటి నుంచే బందీల విడుదల

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ పడనుంది. రేపు బందీలను విడుదల చేయనుంది ఖతార్. మొదటి విడుదలలో 13 మందిని విడుదల చేయనుండగా.. వారిలో అంతా మహిళలు, పిల్లలే ఉన్నారు.

Israel Hamas War: కాల్పుల విరమణ ముగిసిన మొదటి రోజే... గాజాపై వైమానిక దాడి 175మంది మృతి..!!
New Update

ఇజ్రాయెల్(Israel)-హమాస్(Hamas) ఉగ్రవాదుల మధ్య తాత్కాలిక సంధికి టైమ్ దగ్గర పడింది. నవంబర్‌ 24(శుక్రవారం)న బందీలను విడుదల చేయనున్నారు. బందీలను శుక్రవారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తామని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మొదటి విడుదలలో 13 మందిని విడుదల చేయనున్నారు. వీరిలో మహిళలు పిల్లలు ఉన్నారని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి చెప్పారు.


నాలుగు రోజులు సంధీ:
ఈ సంధి నాలుగు రోజులు ఉంటుందని ఇజ్రాయెల్ చెబుతోంది. మిలిటెంట్లు రోజుకు కనీసం 10 మంది బందీలను విడిపించాలని తెలిపింది. దీనిబట్టి చూస్తే నవంబర్ చివరి నాటికి 100 మంది బందీలను విడిపించే అవకాశం ఉందని సమాచారం. అక్టోబరు 7న హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైన విషయం తెలిసిందే. హమాస్‌ తీవ్రవాదులు సరిహద్దు కంచెను దాటిన తర్వాత యుద్ధం మొదలైంది. తమ దేశానికి చెందిన 1,200 మందిని చంపి 240 మంది బందీలను హమాస్‌ స్వాధీనం చేసుకుందని ఇజ్రాయెల్ చెబుతోంది.


హమాస్‌ దాడులకు ప్రతీదాడులు చేసింది ఇజ్రాయెల్. అక్టోబర్‌ 7న మొదలైన యుద్ధం మారణహోమాన్ని సృష్టి్ంచింది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజా పౌరులు చనిపోవడం అత్యంత బాధ కలిగించే విషయం. ఇప్పటివరకు 14,000 కంటే ఎక్కువ గాజన్లు ఇజ్రాయెల్ బాంబు దాడిలో మరణించారు. వారిలో 40శాతం మంది పిల్లలే ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.గాజాలో ఇప్పటికే పలుచోట్ల పాక్షికంగా ఇంటర్నెట్‌, టెలికమ్యూనికేషన్ సేవలను పునరుద్ధరించారు. ఉత్తర గాజాపై హమాస్ తమ నియంత్రణను కోల్పోయిందని.. అందుకే వారి భద్రత కోసం గాజా పౌరులను వేరే చోటుకి వెళ్లనీయకుండా అడ్డుకుంటోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. గాజా ప్రాంతంలోనే అతిపెద్ద ఆసుపత్రి అయిన అల్-షిఫా ఆసుపత్రి ఖాళీ ఐపోయింది. ఈ ఆస్పత్రుల్లో తలదాచుకున్న వందలాది మంది పౌరులతో సహా.. రోగులు, వైద్య సిబ్బంది వేరే చోటుకి వెళ్లిపోయారు. ఆసుపత్రిని ఖాళీ చేయాలని తమకు ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించిందని ఆస్పత్రి వర్గాలు చెప్పడం.. ఆ ఆస్పత్రి డైరెక్టర్‌ను ఇజ్రాయెల్ అరెస్ట్ చేయడం సంచలనం రేపింది.

Also Read:ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ కు షాక్‌..పార్టీని విడనున్న మరో ఎమ్మెల్యే

#latest-news #israel-hamas-war
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe