Israel-Hamas: ఇజ్రాయెల్ - హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంలో మరో కీలక నిర్ణయం..

ప్రస్తుతం ఇజ్రాయెల్ - హమాస్‌ మధ్య కాల్పుల ఒప్పందం సోమవారం రాత్రికి ముగియగా.. తాజాగా ఇరుపక్షాలు ఈ కాల్పుల విరామాన్ని మరో 2 రోజులు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగా హమాస్‌ 10 మంది చొప్పున, ఇజ్రాయెల్ 33 మంది ఖైదీలను విడుదల చేయనుంది.

New Update
Israel-Hamas: ఇజ్రాయెల్ - హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంలో మరో కీలక నిర్ణయం..

ఇజ్రాయెల్ - హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా బందీల విడుదల సజావుగా కొనసాగుతుంది. అయితే ఇప్పుడు మరో రెండ్రోజుల పాటు విరామం లభించింది. అయితే ఇరుపక్షాల మధ్య గతవారం కుదిరిన ఈ కాల్పుల ఒప్పందం పొడిగిస్తే సోమవారం రాత్రికే మగిసిపోయింది. కానీ తాజాగా ఈ కాల్పుల విరామాన్ని పొడగిస్తూ మరో నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతార్ విదేశాంగ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే గాజాలో కాల్పుల విరమణ పొడగింపు అమలులో ఉన్న రోజులు.. హమాస్ అదనంగా 10 మంది చొప్పున బందీలను విడుదల చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఇజ్రాయెల్‌ 33 మంది ఖైదీలను విడుదల చేయనుంది.

Also Read: రాహుల్‌తో తమ బాధలు పంచుకున్న పారిశుద్ధ్య కార్మికులు,ఆటోడ్రైవర్లు, డెలివరీ బాయ్స్‌

మొదటగా కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా 4 విడుతల్లో మొత్తంగా హమాస్‌ 69 బందీలను విడుదల చేసింది. ఇటు ఇజ్రాయెల్ కూడా 117 మంది పాలస్తీనియన్‌ ఖైదీలను విడుదల చేసింది. అయితే ఆదివారం అర్థరాత్రికి మూడు విడుతల్లో హమాస్‌ 58 మంది విడిచిపెట్టింది. ఇక సోమవారం అర్థరాత్రి దాటక మరో 11 మందిని రెడ్‌క్రాస్‌కు అప్పగించింది. అయితే వాళ్లలో ఫ్రెంచ్‌కు చెందినవారు ముగ్గురు ఉన్నారు. అలాగే ఇద్దరు జర్మనీకి చెందినవారు, మరో ఆరుగురు అర్జెంటీనాకు చెందిన వారు ఉన్నారు. ఇదిలాఉండగా.. ఇజ్రాయెల్ - హమాస్ మధ్య నెలకొన్న కాల్పుల విరమణ ఒప్పందం మరికొన్ని రోజులు లేదా శాశ్వతంగా పొడగించాలని చాలా దేశాలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఆఖరికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా ఒప్పందం పొడిగిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం వల్ల మరింత మంది బందీలు విడుదలయ్యే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.

Also read: బ్రాందీ తాగితే జలుబు..దగ్గు ఫసక్…ఏంటీ బ్రో ఇది నిజమేనా..

Advertisment
తాజా కథనాలు