Whey Protein: వే ప్రోటీన్ వాడటం సురక్షితమేనా?

వే ప్రోటీన్ సాధారణంగా ప్రోటీన్ సప్లిమెంట్‌గా ఉపయోగించబడుతుంది. వే ప్రోటీన్ ఆహారంలోని పోషక పదార్ధాలను మెరుగుపరుస్తుంది మరియు రోగనిరోధక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది.

New Update
Whey Protein: వే ప్రోటీన్ వాడటం సురక్షితమేనా?

Whey Protein : వే ప్రోటీన్ అనేది కండరాల పెరుగుదలను పెంచడంలో సహాయపడుతుంది. ఇది వ్యాయామం తర్వాత ఉపయోగించే ఒక ప్రోటీన్ సప్లిమెంట్. వే ప్రోటీన్ బరువు తగ్గడానికి మరియు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. పాలు అనేది కేసైన్ మరియు వే ప్రోటీన్ అనే రెండు ప్రోటీన్లతో తయారవుతాయి. పాలలోని కేసైన్ నుండి పాలవిరుగుడు ప్రోటీన్‌ (Whey Protein)ను వేరు చేయవచ్చు. వే ప్రోటీన్ మొత్తం 9 ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉన్నందున పూర్తి ప్రోటీన్‌గా పరిగణిస్తారు. ఇందులో లాక్టోస్ కంటెంట్ తక్కువగా ఉంటుంది.

వే ప్రోటీన్(Whey Protein) గురించి కొన్ని నిజాలు:

  • వే ప్రోటీన్ ప్రయోజనాలు బరువు తగ్గడం మరియు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం.
  • వే ప్రోటీన్ మన శరీరానికి పడకపొతే వికారం, తలనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
  • వే ప్రోటీన్ ని మితం గా సరైన మోతాదు లో తీసుకుంటే కనుక మంచి ప్రయోజనాలు చూడవచ్చు.

Also read: వేసవిలో ఈ కూరగాయ వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

వే ప్రోటీన్ ప్రయోజనాలు | Whey Protein Benefits

బరువు ను కంట్రోల్ లో ఉంచుతుంది: న్యూట్రిషన్ & మెటబాలిజం ట్రస్టెడ్ సోర్స్‌లో ప్రచురించబడిన 158 మంది వ్యక్తులపై జరిపిన ఒక అధ్యయనంలో, వే ప్రోటీన్ ఇచ్చిన వారు "గణనీయంగా ఎక్కువ శరీర కొవ్వును కోల్పోయారు మరియు లీన్ కండరాలను కోల్పోకుండా శరీరం లో మంచి మార్పులు చూపించారు."

క్యాన్సర్ నిరోధక లక్షణాలు: క్యాన్సర్ చికిత్సలో వే ప్రోటీన్ కాన్సంట్రేట్ యొక్క ఉపయోగాల గురించి యాంటీకాన్సర్ రీసెర్చ్ ట్రస్టెడ్ సోర్స్‌ National Institutes of Health (NIH) (.gov) లో మంచి ఫలితాలు ప్రచురించబడ్డాయి.

కొలెస్ట్రాల్‌ను తగ్గించడం: ది బ్రిటీష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ ట్రస్టెడ్ సోర్స్‌ British Journal of Nutrition లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, 70 మంది అధిక బరువు గల పురుషులు మరియు స్త్రీలకు 12 వారాల పాటు వే ప్రోటీన్ సప్లిమెంట్లను అందించి వారి యొక్క లిపిడ్ మరియు ఇన్సులిన్ స్థాయిల వంటి అనేక పారామితులను కొలిచింది. కేసైన్‌ వాడిన వారి తో పోలిస్తే వే ప్రోటీన్ వాడిన వారిలో 12వ వారంలో మొత్తం కొలెస్ట్రాల్ మరియు ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌లో గణనీయమైన తగ్గుదల ఉందని వారు కనుగొన్నారు.

అయితే, ప్రతి ఒక్కరికీ అదనపు ప్రోటీన్ అవసరం లేదు. మాంసం, చేపలు, పాల ఉత్పత్తులు మరియు గుడ్లు సమృద్ధిగా ఉన్న ఆహారం తింటూ మరియు వ్యాయామం చేసే వ్యక్తులకు ప్రోటీన్ సప్లిమెంట్లను తీసుకోవలసిన అవసరం లేదు. డైట్ లో ప్రోటీన్ పొడి ని జత చేసుకోవాలి అనుకున్న వారు మార్కెట్ లో దొరుకుతున్న ప్రోటీన్ పౌడర్లను జాగ్రత్తగా పరిశీలించి మంచి క్వాలిటీ గల ప్రోటీన్ పొడి ని మాత్రమే వాడాలి అందుకు మీరు డైటీషియన్ ని సంప్రదించి వారి సలహా తీసుకోవటం ముఖ్యం.

Also Read: Covishield Side Effects: కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ.. టెన్షన్ వద్దంటున్న నిపుణులు 

Advertisment
తాజా కథనాలు