Roasted Chanas : వేయించిన శనగల్లో ఇంత పవర్ ఉందా..?

పుట్నాలు చాలా రుచికరంగా ఉండటంతో పాటు కడుపు నిండిన భావనను అందిస్తాయి. వీటితో చాలా రుచికరమైన వంటకాలు కూడా చేయవచ్చు.వేయించిన శనగలు రోజూ తింటే ఏమవుతుందో తెలుసా?

New Update
Roasted Chanas : వేయించిన శనగల్లో ఇంత పవర్ ఉందా..?

Home Food : ఇంట్లో తినడానికి ఏమీ లేకపోయినా లేదా ఈవెనింగ్ టైమ్‌(Evening Time) లో స్నాక్స్‌ తినాలనిపిస్తే గుప్పెడు పుట్నాలు తినవచ్చు. ఎందుకంటే వేయించిన శనగలు (Roasted Chanas/Chickpeas) లేదా పుట్నాలు చాలా రుచికరంగా ఉండటంతో పాటు కడుపు నిండిన భావనను అందిస్తాయి. వీటితో చాలా రుచికరమైన వంటకాలు కూడా చేయవచ్చు. పుట్నాల్లో కొలెస్ట్రాల్ ఉండదు. వీటిలో విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, ఐరన్, సెలీనియం, మాంగనీస్, కాల్షియం, కాపర్, జింక్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ గుండె జబ్బులు రాకుండా కాపాడతాయని డాక్టర్లు చెబుతున్నారు. ఈ పోషకాలు రక్తంలో గడ్డలు(Blood Clots) కట్టకుండా అరికడతాయి. దీంతో గుండెకు రక్తం బాగా అందుతుంది. అంతేకాకుండా, రక్తపోటు అదుపులో ఉంటుంది. వీటి మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకుందాం.

* పోషకాల నిధి

పుట్నాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, రోజుకు కావాల్సిన ఐరన్, మాంగనీస్, ఫోలేట్, జింక్ లాంటి పోషకాలు చాలా వరకు లభిస్తాయి. అంతేకాకుండా, శనగల్లో కొవ్వు చాలా తక్కువ, కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు. హెల్తీ ఫుడ్ కోసం చూస్తున్న వారికి ఛాయిస్ అవుతాయి.

* షుగర్ కంట్రోలర్

పుట్నాల గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అంటే, ఇవి తింటే రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరగదు. బదులుగా, చక్కెర నెమ్మదిగా, స్థిరంగా రక్తంలోకి వెళ్తుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది, ఒక్కసారిగా పెరిగి, పడిపోదు. అందుకే, షుగర్ వ్యాధి ఉన్నవాళ్లకు లేదా రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచుకోవాలనుకునేవాళ్లకు ఇవి చాలా మంచివి.

* బరువు తగ్గాలనుకునే వారికి మంచిది

చిక్‌పీస్‌లో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే చాలా సేపు ఆకలిగా అనిపించకుండా ఉంటుంది. దీంతో ఎక్కువగా తినకుండా, ఆహారం మధ్యలో చిరుతిండి తినకుండా ఉండగలం. ఫలితంగా, బరువు తగ్గడం సులభమవుతుంది.

* రోగ నిరోధక శక్తి

పుట్నాల్లో ఫ్లావనాయిడ్స్, పాలీఫెనోల్స్ లాంటి యాంటీఆక్సిడెంట్లు(Anti-Oxidants) పుష్కలంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల కణాలు దెబ్బతింటాయి, చాలా వ్యాధులు వస్తాయి. యాంటీఆక్సిడెంట్లలో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. అంటే, శరీరంలో వాపు తగ్గడానికి సహాయపడతాయి. కాబట్టి, రోజూ పుట్నాలు తింటే.. మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, చాలా వ్యాధులు రాకుండా ఉంటాయి.

Also Read : ఖాళీ కడుపుతో ఇది తింటే వారంలోనే రక్తం పడుతుంది

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు