True Caller: ట్రూ కాలర్‌తో బ్యాంక్‌ ఖాతాలకు ముప్పు నిజమేనా?.. నిపుణులు చెబుతున్న వాస్తవాలు

స్మార్ట్‌ ఫోన్‌ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరికీ ట్రూ కాలర్‌ గురించి తెలిసే ఉంటుంది. ఈ యాప్‌తో మనకు ఫోన్‌ చేసిన వ్యక్తులు ఎవరో తెలుసుకోవడం చాలా సులువు. అయితే ఈ యాప్‌ గురించి కొన్ని విషయాలు జాగ్రత్త అంటూన్నారు నిపుణులు.

New Update
True Caller: ట్రూ కాలర్‌తో బ్యాంక్‌ ఖాతాలకు ముప్పు నిజమేనా?.. నిపుణులు చెబుతున్న వాస్తవాలు

True Caller:  వ్యక్తి ఫోన్‌ చేసినప్పుడు అతని పేరు, ఈ మెయిల్‌ ఐడీ, కొన్ని సార్లు ఫొటోను కూడా ఈ యాప్‌ చూపిస్తోంది. ట్రూ కాలర్‌ యాప్‌ వల్ల లాభాలతో పాటు అనేక నష్టాలు కూడా ఉన్నాయంటున్నారు సైబర్‌ నిపుణులు. మన వ్యక్తిగత డేటాను హ్యాక్‌ చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి మనం పర్సనల్‌ డేటాను అప్‌లోడ్‌ చేస్తుంటాం. బ్యాంక్ ఖాతాలతో సహా అన్ని వివరాలు నెట్‌లోకి చేరుతున్నాయని, క్షణాల్లో డబ్బు కూడా మాయం అవుతోందన్న ప్రచారం జరుగుతోంది.

ఇది కూడా చదవండి: పీడ కలలు ఎందుకు వస్తాయి..రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..?

యూజర్లకు తెలియకుండానే యూపీఐ ఐడీని ప్రపంచ వ్యాప్తంగా ట్రూ కాలర్‌కు ఉన్న యూజర్లలో 60శాతం మంది భారతీయులే ఉండడం గమనార్హం. సుమారు 10 కోట్ల మంది ఇండియన్స్‌ ఈ యాప్‌ని వాడుతున్నారు. అయితే.. ఈ యాప్‌ వల్ల తమ ప్రమేయం లేకుండానే ఐసీఐసీఐ బ్యాంక్‌ యూపీఐ అకౌంట్లు ఆటోమెటిక్‌గా క్రియేట్‌ అయ్యాయని ఆండ్రాయిడ్‌ యూజర్లు కంప్లైంట్‌ చేస్తున్నారు. ఇటీవల ట్రూకాలర్ యాప్ 10.41.6 వర్షన్‌ను అప్‌డేట్‌ చేసుకున్న వారికి ఇలా యూపీఐ అకౌంట్లు క్రియేట్ అయినట్లు చెబుతున్నారు. ఈ కొత్త వర్షన్‌కు అప్‌డేట్‌ అయిన యూజర్ల బ్యాంక్‌ యూపీఐ ఖాతాలు ట్రూకాలర్‌ పే ఫీచర్‌లో ఆటోమేటిక్‌గా యాడ్‌ అవుతున్నాయట. తమకు యూపీఐ అకౌంట్‌ లేకుండానే డీయాక్టివేట్‌ అయినట్లు మెసేజ్‌లు కూడా వచ్చాయని మరికొందరు చెబుతున్నారు.

కొత్త వర్షన్ రిలీజ్

ఓ యూజర్ ట్రూకాలర్‌ యూపీఐ స్కామ్‌పై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎన్‌పీసీఐ దర్యాప్తు మొదలు పెట్టింది. మరోవైపు ట్రూకాలర్ కూడా స్పందించింది. ఆటోమెటిక్‌గా యూపీఐ అకౌంట్లు క్రియేట్ కావడానికి కారణమైన 10.41.6 వర్షన్‌ను తొలగించింది. ఓ బగ్ కారణంగా ఈ సమస్య తలెత్తిందని, క్షమించాలని యూజర్లను కోరింది. ప్రస్తుతం ప్లే స్టోర్‌లో పాత వర్షన్ 10.40.7 కనిపిస్తోంది. ఇప్పటికే యాప్ అప్‌డేట్ చేసినవారికి కొత్త వర్షన్ రిలీజ్ చేయనుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు